రిలయన్స్ కేపిటల్‌, ఫైజర్‌ నేలచూపు

రిలయన్స్ కేపిటల్‌, ఫైజర్‌ నేలచూపు

ఆటుపోట్ల మార్కెట్‌లో అడాగ్‌ ఫైనాన్షియల్‌ సేవల దిగ్గజం రిలయన్స్‌ కేపిటల్‌,  గ్లోబల్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ లిమిటెడ్‌ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ కేపిటల్‌ షేరు 3.7 శాతం పతనమైంది. రూ. 16 క్షీణించి రూ. 424 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 440 వద్ద గరిష్టాన్నీ.. రూ. 423 దిగువన కనిష్టాన్ని తాకింది. ఇక మరోపక్క ఫైజర్‌ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 3588 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 3610 వద్ద గరిష్టాన్నీ, రూ. 3531 వద్ద కనిష్టాన్నీ తాకింది. కాగా.. మంగళవారం సైతం ఫైజర్‌ కౌంటర్‌ 3 శాతం క్షీణించడం గమనించదగ్గ అంశం. ఇతర వివరాలు చూద్దాం...

రిలయన్స్‌ కేపిటల్‌
బుధవారం రిలయన్స్ కేపిటల్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. ఇంట్రాడేలో ఈ షేరు 3 శాతం పతనమైంది. ఇందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల విడుదల కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రిలయన్స్ కేపిటల్‌ రూ. 111 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 417 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం క్షీణంచి రూ. 563 కోట్లకు పరిమితమైంది. ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఈ కౌంటర్‌ బలహీనంగా కదులుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఫైజర్‌ లిమిటెడ్‌
గ్లోబల్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ లిమిటెడ్‌.. కంపెనీ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇటీవల ఈ కౌంటర్‌ ర్యాలీ బాటలో సాగడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గత రెండు రోజులుగా ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తినట్లు విశ్లేషించారు. ఏడాది కాలాన్ని పరిగణిస్తే ఫైజర్‌ షేరు 74 శాతం దూసుకెళ్లగా.. గత మూడు నెలల్లోనే 37 శాతం ఎగసినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సైతం ఈ షేరు రేటింగ్‌ను బయ్‌ నుంచి హోల్డ్‌కు సవరించినట్లు పేర్కొన్నారు.Most Popular