ఆటుపోట్ల మధ్య-ఎఫ్‌ఎంసీజీ అప్‌!

ఆటుపోట్ల మధ్య-ఎఫ్‌ఎంసీజీ అప్‌!

ప్రపంచ మార్కెట్లు అటూఇటుగా ఉన్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. 37,638 వరకూ ఎగసింది. కాగా.. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలూ, డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి సరికొత్త కనిష్టానికి చేరడం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. అంతేకాదు.. ప్రస్తుతం కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 51 పాయింట్లు పుంజుకుని 37,464కు చేరగా.. నిఫ్టీ 8 పాయింట్లు బలపడి 11,296ను తాకింది.
రియల్టీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 1 శాతం పుంజుకోగా.. రియల్టీ అదే స్థాయిలో నీరసించింది. ఫార్మా, మెటల్‌ 0.5 శాతం చొప్పున నష్టపోగా.. ఐటీ 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, ఐబీ హౌసింగ్‌, గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, లుపిన్‌, టైటన్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ, సన్‌ ఫార్మా 2-1 శాతం మధ్య క్షీణించాయి.
ఎఫ్‌అండ్‌వో
డెరివేటివ్స్‌లో మెక్‌డోవెల్‌, నెస్లే, డాబర్‌, పిరమల్‌, మారికో, కంకార్‌, ఐడియా, పిడిలైట్‌ 3-2 శాతం మధ్య జంప్‌చేయగా.. గ్రాన్యూల్స్‌, ఆర్‌ఈసీ, మణప్పురం, బీవోబీ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, బయోకాన్‌, నిట్‌ టెక్‌, రిలయన్స్‌ కేపిటల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular