టెక్‌ పుష్‌- అమెరికా మార్కెట్లు ప్లస్‌!

టెక్‌ పుష్‌- అమెరికా మార్కెట్లు ప్లస్‌!

యాపిల్‌ తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఊపందుకోవడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. డోజోన్స్‌ 114 పాయింట్లు(0.45 శాతం) ఎగసి 25,971 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 11 పాయింట్లు(0.37 శాతం) పుంజుకుని 2,888 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 48 పాయింట్లు(0.6 శాతం) లాభపడి 7,972 వద్ద  స్థిరపడింది. 

యాపిల్‌ జోరు
సరికొత్త మోడళ్లలో ఐఫోన్లను విడుదల చేయనున్న వార్తలతో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ 2.5 శాతం ఎగసింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్‌ దాదాపు 2 శాతం లాభపడగా.. ఫేస్‌బుక్‌ 1.1 శాతం పెరిగింది. వీటికితోడు ఇంధన దిగ్గజం ఎక్సాన్‌మొబిల్‌ 1.4 శాతం పుంజుకోగా.. చెవ్రాన్‌ 0.5 శాతం బలపడింది. దీంతో మార్కెట్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక రిటైల్‌ సంస్థలు హోమ్‌ డిపో, లోవ్స్‌ కంపెనీస్‌ 1.5 శాతం చొప్పున లాభపడ్డాయి. హాలిడే సీజన్‌లో వీడియోగేమ్స్‌కు డిమాండ్‌ పెరగనున్న అంచనాలతో యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ 7 శాతం, టేక్‌ టు ఇంటరాక్టివ్‌ 4 శాతం చొప్పున జంప్‌చేశాయి. కాగా.. ఎన్‌ఏఎన్‌డీ చిప్స్‌ ధరలు పతనంకానున్న అంచనాలతో వెస్టర్న్‌ డిజిటల్‌ షేరు 3.6 శాతం క్షీణించింది. 

వాణిజ్య వివాదాలు
గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌.. చైనా ఉత్పత్తులన్నిటిపైనా దిగుమతి టారిఫ్‌లను విధించే యోచనలో ఉన్నట్లు ప్రకటించడం ద్వారా వాణిజ్య వివాదాలను మరింత ఎగదోశారు. దీంతో అమెరికాపై ఆంక్షలు విధించాల్సిందిగా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)కు చైనా ఫిర్యాదు చేసింది. డంపింగ్‌ డ్యూటీల విధింపు విషయంలో నిబంధనలు పాటించడంలేదంటూ చైనా ఆరోపించింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');