స్టాక్స్ టు వాచ్ 12 సెప్టెంబర్ 2018

స్టాక్స్ టు వాచ్ 12 సెప్టెంబర్ 2018

దేశీయ సూచీలు రికార్డు స్థాయి నుంచి పతనం బాట పట్టాయి. ఈ నేపథ్యంలో పలు స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. మంగళవారం ట్రేడింగ్ లో 52 వారాల కనిష్ట స్థాయి సమీపంలో స్టాక్స్ చూస్తే... జువారి అగ్రో కెమ్, ఇండోస్టార్ కాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్, వండర్‌లా హాలిడేస్, రాజాపాలయం మిల్, కొచ్చిన షిప్ యార్డ్, శ్రీ కేశవ్ సిమెంట్, పీజీ ఎలక్ట్రోపాస్ట్, హిందుస్తాన్ మిల్, లక్ష్మి ఎలక్ట్రిక్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. బుధవారం ట్రేడింగ్ లో మదుపరులు ఈ స్టాక్స్ కదలికలను గమనించాలి. 

ఇక మంగళవారం ట్రేడింగ్ లో 52 వారాల గరిష్ట స్థాయికి సమీపంలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూస్తే.. సూపర్ శక్తి మెటాలిక్స్, స్పైసీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మీడియా, జీబీఎల్ ఇండస్ట్రీస్, మైండ్ ట్రీ, ఇండియా నివేష్ లిమిటెడ్, యూనిక్ ఆర్గానిక్స్, అక్టావేర్ టెక్నాలజీస్, సిప్లా, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ స్టాక్స్ కదలికలపై కూడా మదుపరులు ఓ లుక్కేయాలి. 

అలాగే సుప్రీం కోర్టు పవర్ కంపెనీలకు దివాలా చట్టం నుంచి ఊరట కల్పిస్తూ స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎస్సార్ పవర్, జీఎమ్ఆర్ ఎనర్జీ, కేఎస్‌కే ఎనర్జీ, రత్తన్ ఇండియా షేర్లను గమనించాలి. 

స్టాక్స్ టు వాచ్ : 
కాడిలా హెల్త్ కేర్ :
కంపెనీకి చెందిన సిటాగ్లిప్టిన్ ఔషధానికి యూఎస్ ఎఫ్ డీఏ నుంచి అనుమతి లభించింది. 
మనాలీ పెట్రోకెమ్ : కంపెనీకి చెందిన యూకే యూనిట్ నోట్ డోమ్ లిమిటెడ్ నుంచి పలు నూతన ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలMost Popular