మనాలీ పెట్రో, కాన్ఫిడెన్స్‌ పెట్రో అప్‌ 

మనాలీ పెట్రో, కాన్ఫిడెన్స్‌ పెట్రో అప్‌ 

నోట్‌డామ్‌ ప్రొడక్టులను దేశీయంగా మార్కెటింగ్‌ చేయనున్నట్లు వెల్లడించడంతో మనాలీ పెట్రోకెమికల్స్‌, బ్లూఫేమ్‌ ఇండస్ట్రీస్‌లో వాటా కొనుగోలు వార్తలతో కాన్పిడెన్స్‌ పెట్రోలియం కౌంటర్లు జోరందుకున్నాయి. వివరాలు చూద్దాం..
మనాలీ పెట్రో 
యూకే అనుబంధ సంస్థ నోట్‌డోమ్‌ ఇండియా విభాగం నుంచి దేశీయంగా ప్రొడక్టులను మార్కెటింగ్‌ చేయనున్న ప్రణాళికల కారణంగా మనాలీ పెట్రోకెమికల్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 39 సమీపంలో ట్రేడవుతోంది. 
ఈ నెల నుంచీ
ఈ నెల నుంచీ నోట్‌డోమ్‌ ఇండియా ప్రొడక్టులను దేశీయంగా ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు మనాలీ పెట్రోకెమికల్స్‌ తాజాగా వెల్లడించింది. 2016 సెప్టెంబర్‌లో విదేశీ అనుబంధ సంస్థల ద్వారా మనాలీ పెట్రో నోట్‌డోమ్‌ను కొనుగోలు చేసింది. నోట్‌డోమ్‌ ప్రొడక్టులను చెన్నైలోని ప్లాంటులో తయారు చేయనున్నట్లు పేర్కొంది. 
కాన్ఫిడెన్స్‌ పెట్రో
బ్లూఫేమ్‌ ఇండస్ట్రీస్‌లో వాటా కొనుగోలు వార్తలతో కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం పెరిగి రూ. 45 వద్ద ట్రేడవుతోంది. జార్ఘండ్‌లో సిలిండర్‌ తయారీ ప్లాంటు కలిగిన బ్లూఫేమ్‌ ఇండస్ట్రీస్‌లో తాజాగా 25 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు కాన్ఫిడెన్స్‌ పెట్రో పేర్కొంది. దీంతో బ్లూఫేమ్‌లో వాటా 75 శాతానికి చేరినట్లు తెలియజేసింది. బ్లూఫేమ్‌ తయారీ సామర్థ్యం వార్షికంగా 6 లక్షల యూనిట్లుకాగా.. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలకు సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు వివరించింది.Most Popular