11 సెప్టెంబర్ 2018, గమనించాల్సిన స్టాక్స్ ఇవే..

11 సెప్టెంబర్ 2018, గమనించాల్సిన స్టాక్స్ ఇవే..

యాక్సిస్ బ్యాంక్, గ్లాక్సో స్మిత్ క్లైన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎల్‌జీ‌బీ ఫోర్జ్ లిమిటెడ్, లింకన్ ఫార్మా లాంటి స్టాక్స్ గడిచిన ట్రేడింగ్ సెషన్ లో 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. ఈ నేపథ్యంలో నేడు కూడా ఈ స్టాక్స్ పై మదుపరులు ద్రుష్టి సారించాలి. 

అలాగే అపోలో ట్యూబ్స్, భారత్ పెట్రోలియం, సెంట్రమ్ కాపిటల్, గామన్ ఇండియా, జెమిని కమ్యూనికేషన్ లాంటి స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ స్టాక్స్ లో కూడా కదలికలు గమనించాలి. 

దీంతో పాటు గెయిల్, ఇంజనీర్స్ ఇండియా, కంటెయినర్ కార్పోరేషన్ లాంటివి ఫైనాన్స్ మినిస్ట్రీ పర్యవేక్షణలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు స్టాక్స్‌‌ను సీపీఎస్ఈ ఈటీఎఫ్ ఫండ్ లో వాటి స్థానంలో నూతన పీఎస్‌యూ సంస్థలతో రీప్లేస్ ప్రయత్నిస్తోంది. పై మూడు స్టాక్స్ పై కూడా నేటి ట్రేడింగ్ లో ఓ లుక్కేయండి.

అలెంబిక్ ఫార్మా : నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా కంపెనీ 300 కోట్ల నిధులను సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 

సన్ ఫార్మా : ఇజ్రాయిల్ కు చెందిన టార్సియస్ ఫార్మా కంపెనీలో 18.75 శాతం విలువైన 3,45,622 ఆర్డినరీ షేర్లను సొంతం చేసుకోనుంది.Most Popular