ఇన్ఫ్రాటెల్ పనైపోతోందా ? ఇప్పుడు ఏం చేయాలి

ఇన్ఫ్రాటెల్ పనైపోతోందా ? ఇప్పుడు ఏం చేయాలి

దేశీయ టెలికాంరంగంలో అతిపెద్ద విలీనంగా చెప్పబడుతున్న వోడాఫోన్-ఐడియా తమ ప్రభావాన్ని త్వరగానే చూపించాయి. ఈ ఎఫెక్ట్ ఎయిర్టెల్ కు శరాఘాతంలా తగిలింది. బారతీ ఇన్ఫ్రాటెల్ నుండి అద్దెకు తీసుకున్న టవర్ల ఒప్పందాన్ని వోడా ఫోన్ రద్దు చేసుకోవడంతో ఎయిర్టెల్ ఆదాయంపై గణనీయమైన ప్రభావం ఉంటుందని అనిపిస్తోంది. 

  
మూడేళ్ళపాటు కోల్పోయిన ఆదాయం
భారతీ ఇన్ఫ్రాటెల్ నుండి టవర్లను అద్దెకు తీసుకున్న వొడాఫోన్ తన ఒప్పందాలను రద్దు చేసుకుంది. దీని ప్రభావంతో 2019-20 వరకు మూడు సంవత్సరాల పాటు ఏయిర్టెల్‌కు  రెవెన్యూ సహా నిర్వాహణపై వచ్చే ఆదాయం కూడా తగ్గనుంది. 
 

ముందు ముందు ఇంకా ఉండొచ్చు...
బ్యాంక్ ఆఫ్‌ అమెరికా మెర్రిల్లించ్ అంచనాల ప్రకారం వొడాఫోన్ ఐడియా విలీన సంస్థ నుండి మరిన్ని అద్దె రద్దు నోటీసులు ఎయిర్టెల్కు రావొచ్చని... అంతకు ముందు కూడా 73 వేల ఓవర్ లాపింగ్ సైట్స్ జరిగాయని పేర్కొంది. 
ఎయిర్ టెల్ ఆదాయంలో క్షీణత
వోడా ఫోన్ టవర్ రెంటల్ ఒప్పందాన్ని రద్దు చేసుకోడం వల్ల భారతీ ఎయిర్టెల్  టవర్ యూనిట్ రేటులో  10-12% క్షీణత మరియు ఆపరేటింగ్ ఆదాయంలోనూ 15-18% క్షీణత ఉంటుందని  స్విస్ బ్రోకరేజ్ సంస్థ UBS  అంచనా వేసింది.

మొత్తానికి ఎయిర్టెల్‌తో పాటు ఇన్ఫ్రాటెల్‌కు కూడా భారీ స్థాయిలో ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి. ఇప్పటికే జియో దెబ్బతో నానా పాట్లు పడ్తూ ఏదో విధంగా నెట్టుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. తాజా ఎఫెక్ట్‌తో మరింత కుంగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 Most Popular