మార్కెట్లు ఇంకా పడితే ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయండి..!

మార్కెట్లు ఇంకా పడితే ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయండి..!

బుల్లిష్‌ మూమెంట్‌ నుంచి దేశీయ మార్కెట్లు ప్రస్తుతం పక్కకు జరిగినట్టు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మార్కెట్లో మరింత పతనం నమోదు కావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమయంలో ఏ స్టాక్స్‌లో కొనుగోలు చేస్తే చక్కని రిటర్న్స్‌ వస్తాయి? నిఫ్టీ 11450 దిగువకు పడిపోతే ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఏ స్టాక్స్ అనుకూలమైనవి..? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. 

గత మూడు నెలలుగా ఊహించని స్థాయిలో పెరిగిన నిఫ్టీ ఈ నెల 3న లోయర్‌ బాటమ్‌కు పడిపోయింది. గత 2 రోజుల్లో కొంత బౌన్స్‌బ్యాక్‌ వచ్చినప్పటికీ మార్కెట్లు ఇంకా డౌన్‌ట్రెండ్‌లోనే ఉన్నాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడికి కనిపిస్తోంది. ఇక వచ్చే 6 నెలల కాలపరిమితిలో నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌ హెడ్‌ షబ్బీర్‌ కయ్యూమి దిగువ ఇచ్చిన స్టాక్స్‌ను కొనుగోలు చేయమని సజెస్ట్‌ చేస్తున్నారు. 

Tata Motors DVR: Buy above Rs 150 | Target: Rs 185 | Stop Loss: Rs 133 | Upside 23 percent

వీక్లీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే ప్రస్తుతం బాటమ్‌ లెవెల్స్‌లో ఉన్న టాటామోటార్స్‌ డీవీఆర్‌ ప్రస్తుతం కొనుగోలుకు అనుకూలమైన స్టాక్‌ అని షబ్బీర్‌ కమ్యూమి సజెస్ట్‌ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌కు స్ట్రాంగ్‌ సపోర్ట్‌ లభించే అవకాశముంది. రూ.133 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేయొచ్చు. ప్రస్తుతం రూ.150 ఎగువన ఈ స్టాక్‌ కదలాడుతోంది. షార్ట్‌టర్మ్‌లో ఈ స్టాక్‌ 23 శాతం రిటర్న్స్‌ అందించే అవకాశముంది. 

DLF: Buy around Rs 208 | Target: Rs 250 | Stop Loss: Rs 184 | Upside 20 percent

కనిష్ట స్థాయి రూ.168 నుంచి డీఎల్‌ఎఫ్‌లో షార్ప్‌ రీబౌండ్‌ వచ్చింది. వీక్లీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే రాబోయే సెషన్లలో ఈ స్టాక్‌లో పుల్‌బ్యాక్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.184 స్టాప్‌లాస్‌తో ఈ స్టాక్‌ను షార్ట్‌టర్మ్‌ కోసం కొనుగోలుకు పరిశీలించవచ్చు. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.250

GODFRYPHLP: Buy around Rs 950 | Target: Rs 1,105| Stop Loss: Rs 848| Upside 17 percent

కనిష్ట స్థాయిని సూచిస్తోన్న ట్రెండ్‌ లైన్‌ వద్ద గ్రీన్‌ కాండిల్స్‌ సూచిస్తుండటంతో రాబోయే సెషన్స్‌లో ఈ స్టాక్‌లో అప్‌సైడ్‌ మొమెంటమ్‌ కనిపిస్తోంది. ఇటీవలే రూ.900 లెవెల్స్‌లో స్ట్రాంగ్‌ బ్రేకవుట్‌ వచ్చింది. 200 రోజుల సగటు కదలిక స్థాయికి సమీపంలో రూ.862 వద్ద ఈ స్టాక్‌కు కీలక సపోర్ట్‌ లభించవచ్చు. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.1105.

Bharti Airtel: Buy above Rs 389 | Target: Rs 450| Stop Loss: Rs 362 | Upside 15 percent

డైలీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌లో కదలాడుతోంది భారతి ఎయిర్‌టెల్‌. జనవరి-మార్చిలో సేవాల లోపాలకు సంబంధించి టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ జరిమానా విధించడంతో ఆ స్టాక్స్‌ ఇవాళ కొంత ఒత్తిడికి లోనవుతోన్నాయి. భారతి ఎయిర్‌టెల్‌కు కూడా ట్రాయ్‌ రూ.11 లక్షల ఫైన్‌ విధించడంతో ఈ స్టాక్‌ ఒకటి రెండు రోజులు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశముంది. షార్ట్‌టర్మ్‌లో ఈ స్టాక్‌లో బౌన్స్‌ బ్యాక్‌ వచ్చే ఛాన్స్‌ వుంది. తగ్గినప్పుడల్లా ఈ స్టాక్‌ను రూ.362 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.450

Amara Raja Batteries: BUY | Buy Around: Rs 815 |Target Rs 900| Stop Loss Rs 778| Upside 10 percent

గరిష్ట స్థాయి రూ.908 వద్ద ఈ స్టాక్‌ అనూహ్యంగా సెల్లింగ్‌ ప్రెజర్‌కు లోనైంది. ప్రస్తుతం లోయర్‌ లెవల్స్‌లో షార్ట్‌కోసం ఈ స్టాక్‌ అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. డైలీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌కు బయింగ్‌ సపోర్ట్‌ లభించవచ్చు. ప్రస్తుతం 200 డీఎంఏ సమీపంలో రూ.811 వద్ద ఈ స్టాక్‌ కదలాడుతోంది. ఈ స్టాక్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యే అవకాశాలున్నాయి. రూ.788 స్టాప్‌లాస్‌తో తగ్గినప్పుడల్లా అమర్‌రాజా బ్యాటరీస్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.900.

గమనిక : పైన ఇచ్చిన రికమండేషన్స్‌ కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనితో ప్రాఫిట్‌ యువర్‌ ట్రేడ్‌ డాట్‌ఇన్‌కు ఎలాంటి సంబంధం లేదు. Most Popular