KVB కష్టాలు తీరినట్లే! షేరు కొంటే కనీసం పాతిక రూపాయల లాభం గ్యారంటీనట

KVB  కష్టాలు తీరినట్లే! షేరు కొంటే కనీసం  పాతిక రూపాయల లాభం గ్యారంటీనట

బ్యాంక్ స్టాక్స్‌లో తక్కువ రేటులో కన్పిస్తూ..అనలిస్టుల మనసుని చూరగొన్నది కరూర్ వైశ్యా బ్యాంక్. ఆర్ధిక ఫలితాలను మాత్రమే గమనిస్తే..అసలు ఈ షేరు జోలికి పోకపోవడమే ఉత్తమం అన్పిస్తుంది..మరి  20 మంది అనలిస్టులలో 15 మంది కొనమని..ఇంకో ఇద్దరు హోల్డ్ చేయమని రికమండ్ చేశారంటే అంతగా ఈ షేరులో అట్రాక్టివ్ అంశాలు ఏం ఉన్నాయనిపించకమానదు..అవేంటో చూద్దాం

ఎన్‌పిఏ సమస్యతో సతమతమవుతోన్న బ్యాంకులలో కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా ఒకటి. ఈ మొదటి త్రైమాసికంలో ఇవి 7.44శాతంగా నమోదు అయ్యాయి కూడా. ఐతే ఈ కార్పోరేట్ స్లిప్పేజీల కథ ఇక ముగిసినట్లే అని అనలిస్టులు చెప్తున్నారు. ఎన్‌పిఏలను వదిలించుకునేందుకు కరూర్ వైశ్యా బ్యాంక్ వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని..ఈ విషయం రానున్న క్వార్టర్ ఫలితాల్లో ప్రతిఫలిస్తుందని అంటున్నారు. ఎన్‌సిఎల్‌టి వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.920కోట్లలో 66శాతం అప్పులకు ఏదోక పరిష్కారం తొందర్లో లభించనుంది. దీంతో ఎన్‌పిఏ ఇష్యూ నుంచి బ్యాంకు దాదాపుగా బైటపడుతుందని అంచనా. ఆదాయం పెంచుకునేందుకు సంస్థ అనుసరిస్తున్న మార్గాల్లో కూడా సానుకూలత కన్పిస్తోంది. ఇందుకు నిదర్శనం ఫీజు రూపంలో వచ్చే ఆదాయంలో 20శాతం జంప్ కన్పించడమే. రిటైల్ టర్మ్ డిపాజిట్లపై దృష్టి పెట్టింది. మరోవైపు రూ.1కోటి పైబడిన టర్మ్ డిపాజిట్లు 14శాతం మాత్రమే కావడం గమనార్హం. కరంట్ , సేవింగ్స్ అక్కౌంట్ల సంఖ్య కూడా 30శాతం పెరగడం విశేషం. 

రిటైల్ లోన్ల మంజూరు 25శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరగగా మొత్తం మంజూరు చేసిన లోన్లలో ఇది 17.2శాతానికి పెరిగాయి.  రిటైల్ లోన్లపైనే ఎక్కువ వడ్డీ వసూలు అవుతుండటం తెలిసిన విషయమే కదా.! మొత్తం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్య నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్..ఇదే కరూర్ వైశ్యా బ్యాంక్ నీ వేధిస్తోంది. ఇది ఏటికేడాది ప్రాతిపదికన చూస్తే, 11 బేసిస్ పాయింట్లు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే 48 బేసిస్ పాయింట్లు తగ్గింది.ఇది ఇచ్చిన ఋణాలపై తీసుకునే వడ్డీ కంటే..డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ ఎక్కువ కావడంతో వచ్చిన నష్టంగా తెలుస్తోంది. ఐతే రిటైల్ లోన్ల మంజూరులో పెరుగుదల నమోదు కావడంతో రానున్న రెండు మూడు క్వార్టర్లలో నిమ్( నెట్ ఇఁట్రెస్ట్ మార్జిన్) పెరుగుతుందని అంచనా. అలానే శాఖల విస్తరణ వేగంగా చేస్తుండటం,  ప్రతి శాఖలో ఆదాయం పెంచుకునే లక్ష్యంగా పని చేస్తుండటం సంస్థ షేరు పెరగవచ్చనేదానికి సంకేతాలుగా చెప్తున్నారు.

ఇదిగో కరూర్ వైశ్యా బ్యాంక్‌కి ప్రముఖ రీసెర్చ్ సంస్థలు ఇచ్చిన టార్గెట్‌లు చూడండి

రికమండ్ చేసిన తేదీ రీసెర్చ్ హౌస్ రికమండేషన్  టార్గెట్ ప్రైస్
ఆగస్ట్ 20, 2018     ఐసిఐసిఐ సెక్యూరిటీస్  కొనండి రూ.140
ఆగస్ట్ 1, 2018    సెంట్రమ్ వెల్త్   హోల్డ్  రూ.117
జులై 30,2018     కె ఆర్ ఛోక్సీ షేర్స్  కొనండి రూ.130
జులై 26,2018    హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్  కొనండి రూ.135
జులై 26, 2018     ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్  కొనండి రూ.124

( కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు గత శుక్రవారం ట్రేడింగ్‌లో రూ.92.10 వద్ద ముగిసింది)

ఇదే రంగంలోని బ్యాంకులలో కొన్నింటిని పోల్చితే కరూర్ వైశ్యా బ్యాంక్ వేల్యూయేషన్స్ ఇలా ఉన్నాయ్

వేల్యూయేషన్  పిబివి పిఈ డివిడెండ్
కరూర్ వైశ్యా బ్యాంక్ 1.25 32.10 2.2%
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.86 66.00 0.07%
బంధన్ బ్యాంక్ 8.06 71.51 0.15%
ఆర్‌బిఎల్ బ్యాంక్ 3.76 36.74 0.27%
యెస్ బ్యాంక్ 3.48 19.81 0.69%

( పై షేరు కొనమని ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్ రికమండ్ చేయడం లేదు)Most Popular