చైనా, భారత్‌లపై ట్రంపరితనం

చైనా, భారత్‌లపై ట్రంపరితనం

ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్  చైనా మీద ఉన్న అసహనాన్ని భారత్‌ను విమర్శించడంలో చూపించారు. చైనా ఉత్పత్తుల మీద భారీ సుంకాలు విధిస్తామంటూనే మీకు రాయితీలుఎందుకివ్వాలంటూ మండిపడ్డారు.  
ట్రంపాగ్రహం
అమెరికా , చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తుండగానే.. ట్రంప్ మరోమారు భారత్‌పై తన అక్కసునువెళ్ళగక్కారు.  చైనా గొప్ప ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO).. పొగడ్తల్లో ముంచెత్తడాన్ని నిరసిస్తూ... చైనాతో బాటు భారత దేశంపై  కూడా ట్రంప్  వ్యంగాస్త్రాలు సంధించారు.
చైనా, భారత్‌లకు నో సబ్సీడీలు
నార్త్ డకోటాలోని ఫార్గొ సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడుతున్న చైనా ,భారత్‌లకు అమెరికా నుండి వచ్చే ప్రతి రాయితీలను బంద్ చేస్తామని ఉద్ఘాటించారు. అమెరికాతో వ్యవహరించేటప్పుడు ఆర్ధికంగా బలహీనంగా ఉన్నామని చెప్పి రాయితీలు పొందే ఈ దేశాలు రేటింగ్స్ విషయం వచ్చేసరికి  అభివృద్ధి చెందామని చెప్పుకుంటాయని.. ఎద్దేవ చేశారు.


మేం కాపలా లేక పోతే దిక్కు లేదు
ఇలా రాయితీల పేరిట విదేశాలకు డబ్బులు ఇవ్వడం ఓ పిచ్చిపనిగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమేనని.. కాకపోతే.. మిగతవారి కంటే శరవేగంగా మేం అభివృద్ధి చెందుతామని చురకలంటించారు. మిగతా దేశాల కంటే సైనిక పాటవం అమెరికాకే ఎక్కువ అనీ, ఎన్నో దేశాలు రక్షణ విషయంలో అమెరికా మీద ఆధార పడి మనుగడ సాగిస్తున్నాయని, కానీ ఆ దేశాలకు అమెరికా అంటే  ఏ మాత్రం గౌరవం లేదని ట్రంప్ విమర్శించారు.
ఇన్నాళ్ళూ రాయితీలపేరిట వేల కోట్ల డాలర్లు దేశం దాటిపోయాయని.. ఇక ముందు అలా జరగబోదని.. ట్రంప్
అన్నారు. మొదటి నుండి భారత్‌పై అక్కసుతో ఉన్న ట్రంప్ అవకాశం దొరకగానే చైనా సాకుతో భారత్‌ను కూడావిమర్శించడం ట్రంప్ టెంపరితనాన్ని సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.Most Popular