ఈ నెలలోనే లాభాలు పంచిపెట్టగల ట్రేడింగ్ రికమెండేషన్స్

ఈ నెలలోనే లాభాలు పంచిపెట్టగల ట్రేడింగ్ రికమెండేషన్స్

పటిష్టమైన జిడిపి గణాంకాలు వచ్చినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాలు మన సూచీలను నష్టాల దిశగా నెడ్తున్నాయి. మరోపైపు కరెన్సీలో కూడా క్షీణత ఇన్వెస్టర్లను, ట్రేడర్లను ఆందోళనకు గురిచేస్తోంది. నిఫ్టీ 11760 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి సుమారు 200 పాయింట్లు కోల్పోయింది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లోనూ ఒత్తిడి పెరుగుతోంది. 

సోమవారం రోజు వచ్చిన 11567 పాయింట్ల కనిష్ట స్థాయిని నిఫ్టీ మరోసారి టెస్ట్ చేసి అంతకు కింద క్లోజ్ అయితే మరింత పతనాన్ని మనం ఊహించవచ్చు. అప్పుడు 11495, 11485 పాయింట్ల వరకూ మార్కెట్లను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 

ఒక వేళ నిఫ్టీ 11760 పాయింట్లను అధిగమించి క్లోజ్ అయితే అప్పుడు 11845-11925 పాయింట్ల గురించి మనం మాట్లాడుకునేందుకు ఆస్కారం ఉంటుంది. 

రాబోయే నెల రోజుల్లో ఈ స్టాక్స్ 9-18 శాతం వరకూ రాబడిని అందించవచ్చు

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ - BUY | CMP 2560 | Stop Loss Rs. 2490 | Target Rs 2800 - 2850

ఈ స్టాక్ నవంబర్ 2015 సమయంలో రూ.4387లతో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. అప్పటి నుంచి స్టాక్‌లో పతనం కొనసాగుతూనే ఉంది. గతేడాది ఆగస్టులో ఈ స్టాక్ రూ.1901 స్థాయికి పడిపోయింది. 
అప్పటి నుంచి ఈ ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ.1900 నుంచి 2600 మధ్య కొట్టుమిట్టాడుతోంది.     
అయితే ఇప్పుడిప్పుడే వాల్యూమ్స్ కూడా స్టాక్‌కు పాజిటివ్‌గా సపోర్ట్ చేస్తున్నాయి. అప్ సైడ్ బ్రేకవుట్ సాధ్యమని అనిపిస్తోంది. 
ఎంఏసిడి (MACD - Moving average Convergence Divergence)  కూడా ఇదే సూచిస్తోంది. దీని ప్రకారం ఈ స్టాక్‍‌ను ప్రస్తుత లెవెల్ నుంచి కొద్దిగా డిప్ వచ్చినా కొనుగోలు చేయొచ్చు. 

మహీంద్రా సీఈఓ ఆటోమోటివ్ - BUY | CMP Rs 284 | Stop Loss Rs 270 | Target 340 | Return 18 %

గత ఏడాది కాలం నుంచి ఈ స్టాక్ రూ.205-265 మధ్యే ట్రేడవుతోంది. అయితే తాజాగా ఈ స్టాక్ వాల్యూమ్స్‌తో సహా పెరిగి కీలకమైన రూ.275-280 రెసిస్టెన్స్ స్థాయిని దాటింది. మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. 

తాజా అప్ సైడ్ బ్రేకవుట్‌తో ఈ స్టాక్ రూ.310 - 160 మధ్య పటిష్ట బేస్ ఏర్పడొచ్చు. అందుకే డిప్స్‌వో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయొచ్చు. 

ఫ్యూచర్ రిటైల్ - BUY - CMP Rs 564 | Stop Loss Rs 550 | Target Rs 650 | Return 18%

ఈ స్టాక్ ప్రస్తుతం నీరసంగా ట్రేడవుతోంది. ఈ ఏప్రిల్‌లో రూ.638 గరిష్ట స్థాయిని టచ్ చేసిన తర్వాత స్టాక్‌లో అమ్మకాల ఒత్తిడిని చూస్తున్నాం. అయితే రూ.452 దగ్గర పటిష్టమైన సపోర్ట్ ఉంది, అక్కడి నుంచి స్టాక్‌లో మంచి రికవరీ వచ్చింది. 
ఆర్ఎస్ఐ, బులింజర్ బ్యాండ్ లెవెల్స్ కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. 
అందుకే ఈ స్టాక్‌ను ప్రస్తుత లెవెల్ నుంచి కొనుగోలు చేయొచ్చు. 

టాటా ఎలక్సి - BUY - CMP Rs 1450 | Stop Loss Rs 1385 | Target Rs 1650 | Return 14%

ఈ స్టాక్ టెక్నికల్‌గా హయ్యర్ టాప్స్, హయ్యర్ బాటమ్స్‌ను ఫార్మ్ చేస్తోంది. ఈ ఏడాది జూలైలో ఈ స్టాక్ రూ.1491 హై టచ్ చేసి, అప్పటి నుంచి కన్సాలిడేషన్‌లో కొట్టుమిట్టాడుతోంది. 
గత ఎనిమిది వారాల నుంచి రూ.1360 - 1490 మధ్య స్టాక్ ట్రేడవుతోంది. 

ప్రస్తుత డిప్స్‌లో స్టాక్‌ను కొనుగోలు చేయొచ్చు. 

యునైటెడ్ స్పిరిట్స్ - Sell - CMP Fut: 614 | Stop Loss: Rs 640 | Target: Rs 560 | Return 9%

ఈ ఏడాది జనవరిలో రూ.802 స్థాయిని తాకినప్పటి నుంచి ఈ స్టాక్‌లో డౌన్ ట్రెండ్ ఉంది. రూ.736 - 802 మధ్య ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్‌ను ఈ స్టాక్ అధిగమించలేకపోతోంది. 

తాజాగా గత వారం ఈ స్టాక్ రూ.662 మార్కును టచ్ చేసినా నిలబడలేకపోతోంది. 
అందుకే ఈ స్టాక్‌ను ప్రస్తుత స్థాయిల దగ్గర సెల్ చేయొచ్చు. 

రచయిత - ఆశిష్ చతుర్మోహత, టెక్నికల్స్ హెడ్ -సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్Most Popular