వచ్చే వారంలో ఆరు రోజులు బ్యాంకులు మూత పడనున్నాయా?

వచ్చే వారంలో ఆరు రోజులు బ్యాంకులు మూత పడనున్నాయా?

సెప్టెంబర్ మొదటి వారంలో బ్యాంకులు, వాటితో పాటే ఏటీఎంలు 6 రోజుల పాటు మూత పడనున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

వాట్సాప్ మెసేజ్ 
సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు, అలాగే సెప్టెంబర్ 8 నుంచి 9 వరకు, వారంలో మొత్తం 6 రోజులు బ్యాంకులకు తాళాలు పడనున్నాయని.. వాట్సాప్ సందేశాలు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోమవారం నాడు కృష్ణాష్టమితో ప్రారంభించి, బ్యాంకు ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె చేస్తున్నారని, ఆ వాట్సాప్ మెసేజ్‌లో ఉందిది. 

బ్యాంకులు అన్నీ, ఏటీఎంలతో సహా సెప్టెంబర్ తొలి వారంలో పూర్తిగా తెరిచే ఉంటాయని, ఏటీఎంల పనితీరుపై కూడా ఎలాంటి ప్రభావం ఉండబోదని, కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టమైన ప్రకటనను జారీ చేసింది. సెప్టెంబర్ తొలివారంలో బ్యాంకుల మూసివేతపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌ కారణంగా ఈ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.

కేంద్రం స్పష్టత

“సెప్టెంబర్ మొదటి వారంలో బ్యాంకులు తెరిచే ఉంటాయి. కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆదివారం అంటే సెప్టెంబర్ 2న, అలాగే రెండో శనివారం అయిన సెప్టెంబర్ 8న మాత్రమే సెలవలు ఉంటాయి. సోమవారం నాడు అంట సెప్టెంబర్ 3న, దేశవ్యాప్తంగా సెలవు లేదు. కొన్ని రాష్ట్రాలలో మాత్రం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.,”అంటూ ఆర్థిక శాఖ వెల్లడించింది.

Image result for bank holidays

ఎక్కడ మొదలై ఉండొచ్చంటే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు సెప్టెంబర్ 4,5 తేదీలలో సమ్మె చేయనున్నట్లు వెల్లడించడం, బహుశా బ్యాంక్ ఉద్యోగుల సమ్మెగా కొందరు అభిప్రాయపడి ఉండవచ్చని, ఆ అపార్ధం కారణంగానే, ఇలాంటి ప్రచారం జరిగి ఉండవచ్చని, బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.Most Popular