క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ లిస్టింగ్‌ గురువారం!

క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ లిస్టింగ్‌ గురువారం!

ప్రధానంగా గ్రామీణ మహిళలు, చిన్న తరహా పరిశ్రమలకు సూక్ష్మ రుణాలు అందించే క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో గురువారం(23న) లిస్ట్‌కానుంది. ఈ నెల 10న ముగించిన పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మొత్తం రూ. 1131 కోట్ల సమీకరణ కోసం షేరుకి 418-422 ధరల శ్రేణిలో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఇష్యూ కేవలం 2.2 రెట్లు అధికంగా సబ్‌స్ర్కయిబ్‌ అయ్యింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) విభాగం నుంచి 5.52 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలైనప్పటికీ.. సంపన్న వర్గాలు(హెచ్‌ఎన్‌ఐ), రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి నామమాత్ర స్పందనే లభించడం గమనించదగ్గ అంశం! 
రెస్పాన్స్‌ ఇలా
ఐపీవోలో భాగంగా క్రెడిట్‌యాక్సెస్‌ 1.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. మొత్తం 4.17 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. అయితే హెచ్‌ఎన్‌ఐ విభాగంలో 0.97 రెట్లు, రిటైల్‌ కోటాలో 0.8 రెట్లు మాత్రమే దరఖాస్తులు లభించాయి. క్విబ్‌ విభాగంలో మాత్రం భారీ స్పందన లభించింది. కాగా.. ఇష్యూకి ముందురోజు(7న) కంపెనీ 23 యాంకర్ సంస్థల నుంచి రూ. 339 కోట్లకుపైగా సమీకరించిన సంగతి తెలిసిందే. యాంకర్‌ సంస్థలకు షేరుకి రూ. 422 ధరలో దాదాపు 80.42 లక్షల షేర్లను కేటాయించింది. 

కంపెనీ నేపథ్యం 
బెంగళూరు కేంద్రంగా 1991లో ప్రారంభమైన క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌.. ప్రధానంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సూక్ష్మ రుణాలను మంజూరు  చేస్తుంటుంది. కంపెనీ గతంలో ‘గ్రామీణ్‌ కూట ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రై.లి.’ పేరుతో సేవలందించేది. దేశంలోని 132 జిల్లాల్లో 516 బ్రాంచీలను కలిగివున్న క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ప్రస్తుతం 5వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, గోవా, కేరళా, ఒడిషా, పాండిచ్చేరి రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. Most Popular