ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో రాజీనామా!

ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో రాజీనామా!

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌కు సీనియర్‌ అధికారి రంగనాథ్ గుడ్‌బై చెప్పారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) బాధ్యతలు నిర్వహిస్తున్న ఎండీ రంగనాథ్‌ రాజీనామాను నేడు(18న) ఆమోదించినట్లు ఇన్ఫోసిస్‌ పేర్కొంది. వృత్తిరీత్యా ఇతర కొత్తతరహా రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రంగనాథ్‌ రాజీనామా చేసినట్లు ఇన్ఫోసిస్‌ తాజాగా తెలియజేసింది. అయితే నవంబర్‌ 16వరకూ ఆయన పదవిలో కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఆలోగా సరికొత్త సీఎఫ్‌వోను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇప్పటికే డిప్యూటీ సీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్న జయేష్‌ సంగ్‌రాజ్‌కాను కొత్త పదవి వరించే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు దశాబ్దాలు
ఇన్ఫోసిస్‌లో దాదాపు రెండు దశాబ్దాల(18ఏళ్లు)పాటు సేవలు అందించిన రంగనాథ్‌ మూడేళ్లుగా సీఎఫ్‌వో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విభిన్న రంగాలలో అవకాశాల అన్వేషణలో భాగంగానే ఇన్ఫోసిస్‌ నుంచి వైదొలగుతున్నట్లు రంగనాథ్‌ తెలియజేశారు. ప్రధానంగా గత మూడేళ్లలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో సమర్ధవంత సేవలు అందించినందుకు గర్విస్తున్నట్లు ఈ సందర్భంగా రంగనాథ్‌ వ్యాఖ్యానించారు. ఈ కాలంలో కంపెనీ ఆర్థికంగా స్థిరత్వం, అత్యున్నత పనితీరు, పటిష్ట పోటీ, ప్రపంచస్థాయి ఫైనాన్స్‌ టీమ్‌ ద్వారా వాటాదారుల విలువను పెంచినట్లు వివరించారు. కాగా.. సీఎఫ్‌వోగా రంగనాథ్‌ కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించినట్లు సీఈవో సలీల్‌ పరేఖ్‌ కితాబునిచ్చారు.
షేరుపై ప్రభావం?
సీఎఫ్‌వో రంగనాథ్‌ రాజీనామా నేపథ్యంలో సోమవారం(20న) ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది. రంగనాథ్‌ రాజీనామాను కంపెనీ శనివారం ఆమోదించింది. కొత్త సీఎఫ్‌వోను నవంబర్‌లోగా ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేసింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');