జీ‌ఎస్‌టితో ఈ స్టాక్స్‌ లాభపడ్డాయ్..ఇదిగో ఇదే ప్రూఫ్

జీ‌ఎస్‌టితో ఈ స్టాక్స్‌ లాభపడ్డాయ్..ఇదిగో ఇదే ప్రూఫ్

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలు తర్వాత కొన్ని కంపెనీలు లాభపడతాయనే ప్రచారం అన్నిచోట్లా నిజం కాకపోయినా, కొన్ని షేర్లు మాత్రం అక్షరాలా నిజంగానే మదుపరులకు లాభాన్ని తెచ్చిపెట్టాయ్. పైగా ఈ ఏడాది కాలం తర్వాత శ్లాబులు మార్చడం కూడా కలిసి వచ్చింది. వాటిలో పెయింటింగ్స్, లెదర్ గూడ్స్, టెక్స్‌టైల్ షాపుల గురించి ముందు నుంచి ఉన్న అంచనాలు నిజం అయ్యాయి కూడా.
ముందుగా 28శాతం శ్రాబులో ఉన్న 50 వస్తువులు శ్లాబులు మారడంతో 19 వస్తువుల పన్ను రేటు తగ్గింది. వాటిలో కొన్ని 12శాతం పరిధిలోకి కూడా రావడంతో ఆమేర మార్జిన్లు మెరుగుపడ్డట్లే భావించాలి. ఇదే అంచనాతో ఈ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు కూడా. ఇక 8-12శాతం పరిధిలోకి వచ్చేసిన కంపెనీలు పన్నులో అయిన ఆదాతో కంపెనీ విస్తరణ ప్రణాళికలతో పాటు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టడానికి వీలు కలిగింది. దీంతోపాటు వినియోగ సంబంధ వస్తువులు..అంటే అవి ఆహార పదార్ధాలు, గృహోపకరణాలు, రోజువారీ వ్యక్తిగత అవసరాలకు వాడేవి అయి ఉన్న కంపెనీలు అయితే మరీ లాభపడ్డాయి కూడా. ఇలా కన్జంప్షన్ థీమ్ మెరుగుపడటానికి కారణం, భారతీయుల జీవన స్థితిగతుల్లో మార్పు రావడం అందుకు ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు కావడం కారణంగా చెప్తున్నారు. ఐతే డీమానిటైజేషన్ వలన రెండేళ్ల క్రితం ఈ రంగం బాగా దెబ్బతిన్నది. కానీ ఆ ప్రభావం నుంచి కోలుకుని తిరిగి మళ్లీ లాభాలు పంచుతుందని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెప్తోంది.

ఫుట్‌వేర్ రంగాన్నే పరిశీలిస్తే, బాటా ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ వంటి వాటిపై గతంలో 18శాతం పన్ను ఉండగా..ఇప్పుడు అది 5శాతానికి తగ్గింది. దీంతో ఈ తగ్గుదల వస్తువులపై ప్రతిబింబిస్తుంది. దీంతో ఈ కంపెనీల ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి. ఐతే కొంతమంది మాత్రం పన్ను తగ్గింపుతోనే ఈ రంగంలో వృధ్ది నమోదు అవుతుందని భావించలేమనే అభిప్రాయంతో ఉన్నారు.కింద ఇచ్చిన పట్టిక‌తో ఏ కంపెనీ షేరు ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు.Most Popular