పైసా వసూల్‌..!

పైసా వసూల్‌..!

బ్యాంక్‌ దివాళా చట్టంతో మొండి బకాయిలు పెద్ద మొత్తంలో వసూలు అవుతున్నాయి. దాదాపు 50 వేల కోట్లను రుణదాతలు వసూలు చేశారు. ఇది క్లెయిమ్స్‌ చేసిన మొండి బకాయిల్లో దాదాపు 56 శాతం కావడం విశేషం. జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) దివాలా తీర్మాన ప్రణాళికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పలు కంపెనీలు తమ రుణాలను చెల్లించేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇంతకు ముందు ఉన్న వ్యవస్థల కంటే ప్రస్తుతం ఉన్న బ్యాంక్‌ దివాళ చట్టం (ఐబీసీ) ఎంతో మెరుగ్గా ఉందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దివాళా చట్టాన్ని సమర్థవంతంగా వినియోగిస్తే బ్యాంకుల ప్రదర్శన రాబోయే కాలంలో మరింత మెరుగ్గా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. 

ఎన్‌సీఎల్‌టీ వద్ద క్లెయిమ్స్‌ అయిన 32 సంస్థల్లో 9 సంస్థలు తమ రుణాల్లో కొంత భాగాన్ని చెల్లించాయి. మొత్తం రూ.89402 కోట్లకు క్లెయిమ్స్‌ రాగా 32 కంపెనీలు రూ.49783 కోట్ల రుణాలను చెల్లించాయి. భూషణ్‌ స్టీల్‌ రూ.56వేల కోట్లకు పైగా బ్యాంకులకు బకాయి పడగా.. అందులో రూ.35571 కోట్లను కంపెనీ చెల్లించింది. మిగిలిన కంపెనీల వివరాలు దిగువ పట్టికలో చూడొచ్చు. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');