ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌, రైట్స్‌... రైట్‌రైట్‌!

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌, రైట్స్‌... రైట్‌రైట్‌!

రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో తప్పనిసరి ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసింది. రూ. 36 సమీపంలో ట్రేడవుతోంది. మరోవైపు రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 317 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 326 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. అయితే రూ. 291 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని సైతం చవిచూడటం గమనించదగ్గ అంశం! నేటి ట్రేడింగ్‌లో రైట్స్‌ కౌంటర్లో లావాదేవీల పరిమాణం మూడురెట్లు ఎగసి 5.63 మిలియన్లను మించడం విశేషం!

ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌
ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎన్‌ఏఎం ఎక్స్‌ప్రెస్‌వేలో 50 శాతం వాటాకు సమానమైన 11.67 కోట్ల ఈక్విటీ షేర్లను రామ్‌కీ ఇన్‌ఫ్రా కొనుగోలు చేయనుంది. మరోవైపు జోరబట్‌ షిల్లాంగ్‌ ఎక్స్‌ప్రెస్‌వే(జేఎస్‌ఈఎల్‌)లో రామ్‌కీ ఇన్‌ఫ్రాకు గల 50 శాతం వాటాకు సమానమైన 4.2 కోట్ల షేర్లను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్ సొంతం చేసుకోనుంది. దీంతో ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌కు జేఎస్‌ఈఎల్‌ పూర్తి అనుబంధ సంస్థగా మారనుంది.  ఈ డీల్స్‌ ద్వారా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కు నికరంగా రూ. 43 కోట్లు లభించనున్నట్లు తెలుస్తోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ప్రమోటర్లకు 73.22 శాతం వాటా ఉంది.

రైట్స్‌ జోరు
గత నెల రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్‌ లిమిటెడ్‌ ఇప్పటివరకూ 61 శాతం దూసుకెళ్లింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 4 శాతమే పుంజుకోగా..  స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఇటీవలే లిస్టింగ్‌ పొందిన ఈ  కౌంటర్‌ అప్పటినుంచీ 70 శాతం జంప్‌చేసింది. ఇష్యూ ధర రూ. 185కాగా.. జులై 2న రైట్స్‌ షేర్లు లిస్ట్‌ అయ్యాయి. Most Popular