వీడని భయాలు- యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌!

వీడని భయాలు- యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌!

గత కొద్ది రోజులుగా వేడెక్కిన వాణిజ్య వివాదాలను పరిష్కరించుకు దిశలో చైనా ప్రతినిధుల బృందం అమెరికాను సందర్శించనుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య ఇటీవల దిగుమతి టారిఫ్‌ల పెంపు కారణంగా వాణిజ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికితోడు టర్కీలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, వర్ధమాన దేశాల కరెన్సీల పతనం.. వంటి అంశాలు కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతూ వచ్చాయి. కాగా.. వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టే బాటలో వచ్చే వారం చర్చలు నిర్వహించేందుకు అమెరికా, చైనా అంగీకరించినట్లు వార్తలు వెలువడటంతో గురువారం అమెరికా మార్కెట్లు లాభపడగా... ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. అయితే టర్కీలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న కారణంగా యూరోపియన్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ సీఏసీ 0.2 శాతం పుంజుకోగా.. యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.15 శాతం బలపడింది. అయితే జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ నామమాత్ర నష్టంతో ట్రేడవుతోంది. 


కాజ్‌ మినరల్స్‌ పతనం
హెల్త్‌, కన్జూమర్‌ స్టేపుల్స్‌, యుటిలిటీస్‌ రంగాలు బలపడినప్పటికీ టెక్నాలజీ వెనకడుగులో ఉంది. యూఎస్‌ దిగ్గజం అప్లయిడ్‌ మెటీరియల్స్‌ నిరుత్సాహకర గైడెన్స్‌ ప్రకటించడమే దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. కంప్యూటర్‌ చిప్‌ల తయారీకి అవసరమయ్యే పరికరాలను సరఫరా చేసే అప్లయ్‌డ్‌ మెటీరియల్స్ చిప్స్‌ విక్రయాలలో రెండేళ్లుగా కనిపిస్తున్న వృద్ధి మందగించనున్నట్లు అంచనా వేసింది. కాగా.. మంగళవారం మొరాండి బ్రిడ్జి కుప్పకూలడంతో గురువారం 22 శాతం పతనమైన అట్లాంటియా షేరు తాజాగా 6 శాతం జంప్‌చేసింది. కజకిస్తాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కాజ్‌ మినరల్స్‌ 10 శాతం పతనమైంది. బార్‌క్లేస్‌ రీసెర్చ్‌ కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తూ టార్గెట్‌ ధరలో కోత పెట్టడం ప్రభావం చూపింది. ఎయిర్‌కెనడా ఎగ్జిక్యూటివ్‌ బెన్‌స్మిత్‌ను కొత్త సీఈవోగా ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించడంతో ఎయిర్‌ ఫ్రాన్స్‌ 2 శాతం క్షీణించింది.Most Popular