అమరావతి బాండ్ల విక్రయాలకు చక్కని స్పందన

అమరావతి బాండ్ల విక్రయాలకు చక్కని స్పందన

బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అమరావతి బాండ్లను సీఆర్‌డీఏ ప్రవేశపెట్టింది. ఇవాళ ఉదయం 11 గంటలకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాండ్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈలో ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఈ బాండ్లకు ఇన్వెస్టర్ల నుంచి చక్కని మద్దతు లభించింది. బాండ్ల విక్రయాలను సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సహా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

రాజధాని నిర్మాణం కోసం ఈ నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరిస్తోంది. ఓ రాజధాని నిర్మాణం కోసం ఇలా బాండ్లను జారీ చేయడం దేశంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. రూ.10 లక్షల ముఖ విలువ కలిగిన ఈ బాండ్లు సంస్థాగత ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంచారు. తొలి విడతలో భాగంగా రూ.1300 కోట్ల నిధులను సేకరించేందుకు ఈ బాండ్లను సీఆర్‌డీఏ విడుదల చేసింది. Most Popular