అన్ని రంగాలూ ఓకే - ఐటీ, రియల్టీ ప్లస్‌!

అన్ని రంగాలూ ఓకే - ఐటీ, రియల్టీ ప్లస్‌!

టర్కీ షాక్‌ నుంచి తేరుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరుగా సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 169 పాయింట్లు ఎగసి 37,814కు చేరింది. నిఫ్టీ సైతం 59 పాయింట్లు పెరిగి 11,415 వద్ద ట్రేడవుతోంది. టర్కీ ఆర్థిక సంక్షోభం, ఆ దేశ కరెన్సీ లైరా పతనం నేపథ్యంలో సోమవారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. రూపాయి 70 మార్క్‌ దిగువకు చేరడంతో ఐటీ ఇండెక్స్‌ 1.25 శాతం ఎగసింది. ఈ బాటలో రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాలు 1.2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, యాక్సిస్‌ బ్యాంక్, విప్రో, జీ, హెచ్‌యూఎల్‌, యస్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.2-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే యూపీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌, వేదాంతా, ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ 3-0.3 శాతం మధ్య నీరసించాయి.
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, డీఎల్‌ఎఫ్‌, దివాన్‌ హౌసింగ్‌, అదానీ పవర్‌, మైండ్‌ట్రీ, నిట్‌ టెక్‌, ఆర్‌కామ్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, అంబుజా సిమెంట్‌ 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్కకేడిలా హెల్త్‌, టాటా కెమ్‌, చెన్నై పెట్రో, సీజీ పవర్‌, యూపీఎల్‌, ఆయిల్‌ ఇండియా, పీసీ జ్యువెలర్స్‌, రెప్కో హోమ్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, గ్రాన్యూల్స్‌ 4.4-2.7 శాతం మధ్య నష్టపోయాయి.
చిన్న షేర్లు ఇలా
మార్కెట్లు జోరందుకోవడంతో చిన్న షేర్లూ పుంజుకున్నాయి. బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1210 లాభపడగా.. 1151 నష్టాలతో కదులుతున్నాయి.Most Popular