గ్రీవ్స్‌ కాటన్‌ డీలా -`బాలకృష్ణ భల్లేభల్లే!!

గ్రీవ్స్‌ కాటన్‌ డీలా -`బాలకృష్ణ భల్లేభల్లే!!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు విడుదల చేయడంతో గ్రీవ్స్‌ కాటన్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో  ప్రయివేట్‌ రంగ సంస్థ గ్రీవ్స్‌ కాటన్‌ షేరు డీలాపడగా..  కార్బన్‌ బ్లాక్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిన వార్తలతో ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది.

గ్రీవ్స్‌ కాటన్‌ 
ఇంజిన్లు, జెన్‌సెట్ల తయారీ సంస్థ గ్రీవ్స్‌ కాటన్‌ సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3 శాతం క్షీణించి రూ. 147 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 151 వద్ద గరిష్టాన్నీ, రూ. 142 వద్ద కనిష్టాన్నీ తాకింది. 
ఫలితాలు వీక్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌ నికర లాభం 3 శాతంపైగా నీరసించింది. రూ. 40 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం దాదాపు 1 శాతం పెరిగి రూ. 468 కోట్లను తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 51 శాతం వాటా ఉంది.

బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 
కార్బన్‌ బ్లాక్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5 శాతంపైగా జంప్‌చేసి రూ. 1290 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1299 వద్ద గరిష్టాన్నీ, రూ. 1234 వద్ద కనిష్టాన్నీ తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 58.3 శాతం వాటా ఉంది. 
కార్బన్‌ బ్లాక్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని వార్షికంగా ప్రస్తుతం 60,000 ఎంటీకు పెంచుకున్న కంపెనీ 2020-2021కల్లా 1.4 లక్షల ఎంటీకి పెంచుకునే ప్రణాళికలు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ప్లాంట్‌ విస్తరణను చేపట్టేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ తెలియజేసింది. ఇందుకు రూ. 425 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. Most Popular