పేజ్‌ ఇండస్ట్రీస్‌ జూమ్‌-వక్రంగీ పతనం!

పేజ్‌ ఇండస్ట్రీస్‌ జూమ్‌-వక్రంగీ పతనం!

ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు పెట్టుబడులకు ఆధారంగా తీసుకునే మోర్గాన్‌స్టాన్లీ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) ఇండెక్స్‌లో చేపట్టనున్న మార్పులు దేశీయంగా రెండు కౌంటర్లపై విభిన్న ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నెల(ఆగస్ట్) 31నుంచి ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో పేజ్‌ ఇండస్ట్రీస్‌కు చోటు లభించనుంది. ఇందుకు వీలుగా ఇండెక్స్‌ నుంచి వక్రంగీ లిమిటెడ్‌ను తప్పిస్తున్నట్లు ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌ పేర్కొంది. 


షేర్ల తీరు ఇలా
అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ప్రామాణికంగా తీసుకునే ఎంఎస్‌సీఐ ఇండెక్సులో మార్పుల కారణంగానే ప్రధానంగా పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగితే.. వక్రంగీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 33,720 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 34,250 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం గమనార్హం! కాగా.. మరోవైపు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో వక్రంగీ లిమిటెడ్‌ షేరు 12 శాతంపైగా పతనమైంది. రూ. 44 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 46 వద్ద గరిష్టాన్నీ, రూ. 42 వద్ద కనిష్టాన్నీ తాకింది.Most Popular