ఫలితాల ప్రభావంతో ఎస్‌బీఐ ఊగిసలాట

ఫలితాల ప్రభావంతో ఎస్‌బీఐ ఊగిసలాట

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మదుపర్లను గందరగోళానికి గురి చేశాయి. ఇవాళ ఉదయం నుంచి ఎస్‌బీఐ షేర్ నష్టాలలో ఉండగా.. లాభాలను ప్రకటిస్తుందనే అంచనాలుండగా.. భారీ నష్టాలను ప్రకటించడం.. షేరు ధరపై ప్రభావం చూపింది.

దీంతో ఒక దశలో 5 శాతం మేర దిగజారిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్.. ఆ తర్వాత కోలుకుంది. ఆస్తుల నాణ్యత పెరగడంతో.. 2 శాతం పైగా లాభాల్లోకి చేరుకున్నా.. ఆ స్థాయిలో నిలబడడం ఏ మాత్రం సాధ్యం కాలేదు. హైయర్ లెవెల్స్‌లో ఎస్‌బీఐ షేరుకు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురైంది.

దీంతో మరోసారి ఎస్‌బీఐ స్క్రిప్ నష్టాల్లోకి చేరుకుంది. 3.94 శాతం నష్టంతో రూ. 304.90 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో గరిష్టంగా రూ. 326.40 స్థాయిని.. కనిష్టంగా 300.50  స్థాయిని ఎస్‌బీఐ నమోదు చేసింది. Most Popular