ఎస్‌బీఐ క్యూ1 - రూ. 4876 కోట్ల నష్టాలు

ఎస్‌బీఐ క్యూ1 - రూ. 4876 కోట్ల నష్టాలు

దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఏప్రిల్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించింది. క్యూ1లో బ్యాంక్ రూ. 4875.85 కోట్ల నష్టాలు నమోదు చేసినట్లు ఆర్థిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

పెరిగిన నికర వడ్డీ ఆదాయం
నికర వడ్డీ ఆదాయం మాత్రం అంచనాలను మించి నమోదు కావడం గమనించాల్సిన విషయం. క్యూ1లో 23 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం రూ. 21729 కోట్లకు చేరుకుంది. 
అయితే ఇతర ఆదాయం లేదా నికర వడ్డీయేతర ఆదాయం మాత్రం 16.5 శాతం తగ్గి రూ. 6679 కోట్లకు పరిమితమైంది.

నిరర్ధక ఆస్తులు
స్థూల నిరర్ధక ఆస్తుల విషయంలో పురోగతి చూపించింది ఎస్‌బీఐ. గతేడాది ఇదే కాలంలో 10.91 శాతంగా ఉన్న గ్రాస్ ఎన్‌పీఏ.. ఇప్పుడు 10.69 శాతానికి దిగి వచ్చింది.

ఇక నికర నిరర్ధగ ఆస్తుల విషయానికి వస్తే.. గతేడాది జూన్ చివరకు 5.97 శాతంగా ఉండగా.. మార్చ్ చివరకు ఇవి 5.73 శాతంగా ఉన్నాయి. కానీ జూన్ చివరకు మాత్రం 5.29 శాతానికి మెరుగవడం చెప్పుకోవాల్సిన విషయం.

ఆస్తుల నాణ్యత పెరగడం షేర్ ధరపై కూడా ప్రభావం చూపించింది.Most Popular