నెగిటివ్ ట్రెండ్‌లోనే ఇండెక్స్‌లు

నెగిటివ్ ట్రెండ్‌లోనే ఇండెక్స్‌లు

స్టాక్ మార్కెట్లలో నష్టాల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి నెగిటివ్ జోన్‌లోనే ఉన్న మార్కెట్లు.. మిడ్ సెషన్ సమయానికి మరింతగా నష్టాలను పెంచుకున్నాయి. 

ఐరోపా మార్కెట్లు కూడా నెగిటివ్‌గానే ఉండడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. 113 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 37,910 వద్ద ట్రేడవుతోంది. 31 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,439 దగ్గర ట్రేడవుతోంది. 13 పాయింట్లు క్షీణించిన బ్యాంక్ నిఫ్టీ 28333 వద్ద నిలిచింది.

బ్యాంకింగ్ సెక్టార్ అర శాతం నష్టాల నుంచి కోలుకోగా..క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, మెటల్స్ కౌంటర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది.

నిఫ్టీలో ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎం అండ్ ఎం షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. సన్ ఫార్మా, ఐడియా సెల్యులార్, టాటా మోటార్స్, వేదాంత, గ్రాసిం కంపెనీలు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి..Most Popular