నష్టాల్లో మొదలైన యూరోప్ మార్కెట్లు

నష్టాల్లో మొదలైన యూరోప్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల సరళిని అనుసరిస్తూ.. ఐరోపా సూచీలు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. ప్రధాన యూరోప్ సూచీలన్నీ నెగిటివ్‌గానే ఉన్నాయి. అన్ని మార్కెట్లు అర శాతం నుంచి ఒక శాతం వరకూ నెగిటివ్‌గా ట్రేడవుతున్నాయి.

48 పాయింట్లు కోల్పోయిన ఎఫ్‌టీఎస్ఈ 7693 వద్ద.. 49 పాయింట్లు నష్టపోయిన సీఏసీ 5453 వద్ద ట్రేడవుతున్నాయి. 115 పాయింట్లు క్షీణించిన డాక్స్ 12560 వద్ద నిలిచింది.

ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉండడంతో.. మన మార్కెట్లలో ప్రతికూలత మరింతగా పెరిగింది. ఉదయం సెషన్ తో పోల్చితే ప్రస్తుతం కొంతమేర నష్టాలు పెరిగాయి.

106 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 37917 వద్ద ఉండగా..  30 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 11440 వద్ద నిలిచింది. ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ సెక్టార్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, బ్యాంకింగ్ షేర్లకు నష్టాలు ఎదురవుతున్నాయి. Most Popular