ఏయూ స్మాల్ ఫైనాన్స్ కౌంటర్‌లో బ్లాక్ డీల్స్

ఏయూ స్మాల్ ఫైనాన్స్ కౌంటర్‌లో బ్లాక్ డీల్స్

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కౌంటర్ ఇవాళ ర్యాలీ చేస్తోంది. ఈ కౌంటర్‌లో ఇవాళ భారీ వాల్యూమ్స్ నమోదు అవుతున్నాయి. గత రెండు వారాలుగా ఈ కౌంటర్‌లో 40వేల షేర్లు మాత్రమే ట్రేడ్ అవుతుండగా.. ఇవాళ బ్లాక్ డీల్స్ ప్రభావంతో షేర్ పరుగులు తీస్తోంది.

ఏయూ స్మాల్ ఫైనాన్స్‌లో 5 శాతం వాటాను వార్‌బర్గ్ పిన్‌కస్ కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ కౌంటర్‌ను కొనుగోలు చేసేందుకు షేర్‌హోల్డర్లు ఉత్సాహం చూస్తున్నారు.

ఒక దశలో రూ. 711 వరకు పెరిగిన ఈ షేర్ ధర.. ప్రస్తుతం 7.99 శాతం లాభంతో రూ. 695 వద్ద ట్రేడవుతోంది. Most Popular