అదాని గ్రీన్ ఎనర్జీ 5 శాతం అప్

అదాని గ్రీన్ ఎనర్జీ 5 శాతం అప్

ఇవాల్టి ట్రేడింగ్‌లో అదాని గ్రీన్ ఎనర్జీ షేర్ ధర 5 శాతం లాభాలతో ట్రేడవుతోంది. అదాని ట్రేడ్‌కామ్ ఎల్ఎల్‌పీ, అదాని ట్రేడింగ్ సర్వీసెస్ ఎల్ఎల్‌పీ నుంచి అదాని రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్‌లో వాటాను 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 

2015 మార్చ్‌లో అదాని గ్రీన్ పార్క్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు అయింది. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్కుల అభివృద్ధి కోసం ఈ వ్యాపారాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడీ కంపెనీ పూర్తిగా అదాని గ్రీన్ ఎనర్జీ చేతుల్లోకి వచ్చింది.

ఈ ప్రభావంతో ఇవాల్టి ట్రేడింగ్‌లో లాభాలను గడించిన ఈ షేర్ రూ. 66.10 పైసల ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 4.93 శాతం లాభంతో రూ. 66 వద్ద అదాని గ్రీన్ ఎనర్జీ ట్రేడవుతోంది.Most Popular