నష్టాల్లో ట్రేడవుతోన్న మార్కెట్లు

నష్టాల్లో ట్రేడవుతోన్న మార్కెట్లు

మన స్టాక్ మార్కెట్లు ఇవాళ కన్సాలిడేషన్ ధోరణి ప్రదర్శిస్తున్నాయి. వరుస లాభాల తర్వాత సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కుంటున్నాయి. ప్రధాన ఇండెక్స్ కౌంటర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.

ప్రస్తుతం సెన్సెక్స్ 86 పాయింట్ల నష్టంతో 37937 వద్ద ఉండగా.. 24 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11446 వద్ద ట్రేడవుతోంది. 67 పాయింట్ల నష్టంతో 28252 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడవుతోంది.

అటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ సెక్టార్లు లాభాలలో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, హెల్త్ కేర్ రంగాల్లోని షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. 

నిఫ్టీలో ఐషర్ మోటార్స్, యస్ బ్యాంక్, యూపీఎల్, భారతి ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా ఉండగా... ఐడియా సెల్యులార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా, గ్రాసిం, కోల్ ఇండియా నష్టాల్లో ఉన్నాయి. Most Popular