వక్రాంగీకి సెబీ షాక్

వక్రాంగీకి సెబీ షాక్

ఓపెన్ ఆఫర్ ప్రకటించాలంటూ వక్రాంగీ హోల్డింగ్స్‌కు సెబీ భారీ షాక్ ఇచ్చింది. 45 రోజులలోగా ఓపెన్ ఆఫర్‌ను ఇవ్వాలంటూ వక్రాంగీలో 29శాతం వాటా కలిగి ఉన్న వక్రాంగీ హోల్డింగ్స్‌కు సెబీ ఆదేశాలు ఇచ్చింది. 

2013లో తన వాటాను 25 శాతంకు మించి పెంచుకున్న వక్రాంగీ హోల్డింగ్స్.. అక్కడి నుంచి ఓపెన్ ఆఫర్ ఇవ్వలేదు. దీంతో ఆ సమయానికి కంపెనీలో పెట్టుబడులు చేసి, ఇప్పటికీ హోల్డింగ్ చేసిన అందరికీ 10శాతం వడ్డీతో సహా చెల్లింపులు చేయాలని సెబీ ఆదేశించింది.

కొత్తగా సెబీ ఆదేశాల రూపంలో ముంచుకొచ్చిన ముప్పు ప్రభావంతో.. ఇవాళ వక్రాంగీ షేర్ మరోసారి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో వక్రాంగీ షేర్ ధర 5.86 శాతం నష్టంతో రూ. 61 వద్ద ట్రేడవుతోంది.Most Popular