నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

వరుసగా అప్‌ట్రెండ్‌తో దూసుకుపోయిన మన మార్కెట్లు ఇవాళ ఆరంభంలో కాస్త నెమ్మదించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న మిశ్రమ సంకేతాల కారణంగా.. మన మార్కెట్లు ఆరంభంలోనే నష్టాల్లోకి పడిపోయాయి. 

ప్రస్తుతం సెన్సెక్స్ 95 పాయింట్ల నష్టంతో 37929 వద్ద ట్రేడవుతోంది. కీలకమైన 38వేల పాయింట్ల స్థాయి దిగువకు సెన్సెక్స్ చేరుకుంది. 0.23 శాతం నష్టపోయిన నిఫ్టీ 26.5 పాయింట్ల నష్టంతో 11444 వద్ద ట్రేడవుతోంది. 128 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ 28191 వద్ద నిలిచింది.

కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ సెక్టార్లలోని షేర్లు లాభాల్లో ఉండగా.. ఎనర్జీ, ఫైనాన్స్, పీఎస్‌యూ రంగాల్లోని షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.

నిఫ్టీలో ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, యస్ బ్యాంక్, యూపీఎల్, సిప్లా షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. ఎస్‌బీఐ, ఐడియా సెల్యులార్, భారతి ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిం షేర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.Most Popular