ఫ్లాట్ ఓపెనింగ్ కి ఛాన్స్

ఫ్లాట్ ఓపెనింగ్ కి ఛాన్స్

స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. 

అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగియడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుండడం మన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. గత రాత్రి అమెరికా ఫ్లాట్‌గా ముగియగా.. రికార్డు స్థాయి గరిష్టానికి అమెజాన్‌ షేర్ చేరుకుంది. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ లాభాలు లాభాలు కొనసాగగా.. గత ఏడాది అక్టోబర్‌ తర్వాత సుదీర్ఘా ర్యాలీ కొనసాగడం ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం. 

అయితే.. యూఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ భయాల కారణంగా అంతర్జాతీయ మదుపర్లు అప్రమత్తంగా ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. షాంగై, జకార్తా మినహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఇక దేశీయ పరిణామాలను పరిశీలిస్తే.. జూన్‌ నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలపై మదుపరులు దృష్టిపెట్టారు. ఇవాళ సాయంత్రం గం.5.30లకు జూన్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. 

సానుకూల వార్తలు వెలువడితే ఇవాళ ఇంట్రాడేలో నిఫ్టీ 10500 మార్కును అధిగమించవచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. Most Popular