రామ్‌కో సిస్టమ్స్‌కు ఏపీ కార్గో కాంట్రాక్ట్‌ కిక్‌

రామ్‌కో సిస్టమ్స్‌కు ఏపీ కార్గో కాంట్రాక్ట్‌ కిక్‌

మల్టీమిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు వెల్లడించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ రామ్‌కో సిస్టమ్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 408 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 380 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.
ఫిలిప్పీన్స్‌ ఆర్డర్
ఫిలిప్పీన్స్‌కు చెందిన ఏపీ కార్గో లాజిస్టిక్‌ నెట్‌వర్క్‌ కార్ప్‌ తమ సాఫ్ట్‌వేర్‌ సేవల కోసం కాంట్రాక్టు ఇచ్చినట్లు రామ్‌కో సిస్టమ్స్‌ పేర్కొంది. తాము అభివృద్ధి చేసిన లాజిస్టిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం ద్వారా ఏపీ కార్గో జాతీయ స్థాయిలో రవాణా సర్వీసులను క్రమబద్ధీకరించుకోనున్నట్లు తెలియజేసింది. ఏపీ కార్గో ఫిలిప్పీన్స్‌లో వైమానిక రవాణాకు పేరెన్నికగన్న సంస్థగా తెలియజేసింది. వైమానిక కార్గో, తదితర వస్తువుల రవాణలో కంపెనీ ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్స్‌ను అందిస్తుంటుందని  తెలియజేసింది. 
ఇతర వివరాలు
మల్టీ మిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా ఏపీ కార్గోకు అవసరమయ్యే ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, హబ్‌ మేనేజ్‌మెంట్‌, వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర సర్వీసులకు ఏకీకృత, మొబైల్‌ ఫ్రెండ్లీ మాడ్యూల్స్‌ను అభివృద్ది చేయనున్నట్లు రామ్‌కో సిస్టమ్స్‌ తెలియజేసింది. అంతేకాకుండా హెచ్‌ఆర్‌, పేరోల్‌ తదితర సర్వీసులకు సమీకృత ఎండ్‌టు ఎండ్‌ సేవలను సమకూర్చనున్నట్లు వివరించింది. లాజిస్టిక్స్‌, షిప్పింగ్‌ విభాగంలో తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఏపీ కార్గో తమకు ఖాతాదారుకావడంతో మొబైల్‌ ఫ్రెండ్లీ ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌కు మరింత గుర్తింపు లభించనట్లయ్యిందని ఈ సందర్భంగా రామకో సిస్టమ్స్‌ సీఈవో వీరేందర్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.Most Popular