మార్కెట్లు అప్‌- మీడియా, ఫార్మా డౌన్‌

మార్కెట్లు అప్‌- మీడియా, ఫార్మా డౌన్‌

ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ ప్రస్తుతం 131 పాయింట్లు ఎగసి 38,019కు చేరగా... నిఫ్టీ సైతం 22 పాయింట్ల లాభంతో 11,472 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ప్రోత్సాహకర సెంటిమెంటు కారణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు సరికొత్త చరిత్రను సృష్టించాయి. సెన్సెక్స్‌ తొలిసారి 38,000 పాయింట్ల మైలురాయిని అందుకోగా.. నిఫ్టీ 11,495 వద్ద, బ్యాంక్‌ నిఫ్టీ 28,340 వద్ద కొత్త గరిష్టాలకు చేరాయి. ఈ బాటలో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500 మార్క్‌పై దృష్టిపెట్టి సాగుతోంది.
పీఎస్‌యూ బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ దాదాపు 3 శాతం జంప్‌చేయగా, రియల్టీ 1.6 శాతం ఎగసింది. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌ 0.5 శాతం స్థాయిలో పుంజుకోగా... మీడియా, ఫార్మా 0.4 శాతం చొప్పున నీరసించాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌, ఓబీసీ,  బీవోబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంక్‌ 4.6-2 శాతం మధ్య ఎగశాయి. ఇక రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా డెవలపర్స్‌, యూనిటెక్, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 4.6-1.4 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌ 4.3 శాతం పతనంకాగా.. టైటన్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, జీ, టెక్‌ మహీంద్రా, ఐబీ హౌసింగ్, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి.
చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లు సైతం జోరందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.2 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన మొత్తం షేర్లలో 1302 లాభపడగా. 1195 నష్టాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఆర్‌కామ్‌, నాల్కో, అదానీ పవర్‌, యూనియన్ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, కమిన్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌, కన్సాయ్‌ నెరోలాక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్; ఎండ్యూరెన్స్‌ తదితరాలు 10-2 శాతం మధ్య ఎగశాయి. స్మాల్‌ క్యాప్స్‌లో స్టైలమ్‌, కోకుయో కేమ్లిన్‌, హెచ్‌సీసీ, ఎంబీఎల్‌, విష్ణు, హాథవే, బోరోసిల్‌, వెంకీస్‌, డెన్‌ నెట్‌, ఐవోబీ, టీపీఎల్‌ ప్లాస్ట్, మధుకాన్‌, అవంతీ, క్వాలిటీ, రిలయన్స్‌ నావల్‌ తదితరాలు 17-5 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular