బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.3వేల మార్కును అధిగమిస్తుందా..?

బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.3వేల మార్కును అధిగమిస్తుందా..?

నిన్నటి రికార్డును తిరగరాస్తూ ఇవాళ బజాజ్‌ ఫైనాన్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి(2,846.05)ని టచ్‌ చేసింది. దీంతో బజాజ్‌ ఫైనాన్స్‌ 3వేల మార్కును క్రాస్‌ చేస్తుందని ఎనలిస్టులు  అంచనా వేస్తున్నారు. టెక్నికల్‌ ప్యాట్రన్‌ ప్రకారం బజాజ్‌ ఫైనాన్స్‌ అతి త్వరలోనే 3వేల మార్కును దాటుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

జూలై 19న రూ.2358 వద్ద ట్రేడైన బజాజ్‌ ఫైనాన్స్‌కు అనుహ్యంగా కొనుగోళ్ళ మద్దతు లభించడంతో అదే రోజూ రూ.2745ను చేరింది. జూలై 23న(కేవలం 3 సెషన్లలో) రూ.2797ను తాకింది. ఆ తర్వాత 11 సెషన్ల పాటు 117 పాయింట్ల శ్రేణి అంటే రూ.2655-2772 మధ్య కదలాడింది. చివరకు నిన్న ఇంట్రాడేలో రూ.2819.65కు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని టచ్‌ చేసింది. తాజా పెరుగుదలతో ఈ స్టాక్‌లో మొమెంటమ్‌ వచ్చినట్టు కనిపిస్తోందని, మరికొన్ని సెషన్లలో బజాజ్‌ ఫైనాన్స్‌ 3వేల మార్కును అధిగమించడం ఖాయమని మోతిలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. 

ఆగస్ట్‌ 30తో ముగిసే ఆప్షన్‌ ఎక్స్‌పైరీలో బజాజ్‌ ఫైనాన్స్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌(ఒఐ) గరిష్ట కాల్‌ స్ట్రైక్‌ ధర రూ.3వేలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇది 7శాతం ఎక్కువ. అందువల్ల ఈ సిరీస్‌లోనే బజాజ్‌ ఫైనాన్స్‌ 3వేల మార్కును సులువుగా అధిగమిస్తుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 23మంది ఎనలిస్టుల్లో 13 మంది Buyకి సిఫారసు చేస్తుందని 8మంది Hold చేయమని చెబుతున్నారు. ఇద్దరు ఎనలిస్టులు మాత్రం SELL చేయమని అడ్వైజ్‌ ఇస్తున్నారు. 
 Most Popular