11,500వైపు నిఫ్టీ- ప్రభుత్వ బ్యాంక్స్‌ హవా!

11,500వైపు నిఫ్టీ- ప్రభుత్వ బ్యాంక్స్‌ హవా!

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. సెన్సెక్స్‌ తొలిసారి 38,000 పాయింట్ల మైలురాయిని అందుకోగా.. నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ మరోసారి ఇంట్రాడేలో కొత్త గరిష్టాలకు చేరాయి. ఈ బాటలో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500 మార్క్‌పై దృష్టిపెట్టి సాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ ప్రస్తుతం 139  పాయింట్లు ఎగసి 38,027కు చేరగా... నిఫ్టీ సైతం 32 పాయింట్ల లాభంతో 11,482 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్యాంక్‌ నిఫ్టీ గరిష్టంగా 28,340కు చేరడం విశేషం! అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదిరిన నేపథ్యంలో బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. చైనా దాదాపు 2 శాతం ఎగసింది.
మీడియా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్‌, రియల్టీ 2.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మీడియా 0.6 శాతం నీరసించింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఓబీసీ, అలహాబాద్‌, బీవోబీ, ఆంధ్రా బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంక్‌ 3.6-2 శాతం మధ్య ఎగశాయి. ఇక రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా డెవలపర్స్‌, యూనిటెక్, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 5-2 శాతం మధ్య పెరిగాయి. 
ఐసీఐసీఐ జోరు
ఇతర నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ 6 శాతం జంప్‌చేయగా, యాక్సిస్‌ బ్యాంక్‌, లుపిన్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా 2.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే మరోవైపు ఎయిర్‌టెల్‌ 4.3 శాతం పతనంకాగా..  టైటన్‌, ఓఎన్‌జీసీ, జీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ 1.7-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి.
చిన్న షేర్ల జోరు
మార్కెట్ల బాటలో చిన్న షేర్లు సైతం జోరందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సలు 0.35 శాతం చొప్పున బలపడ్డాయి. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన మొత్తం షేర్లలో 1320 లాభపడగా.. 889 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. Most Popular