క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌కు యాంకర్‌ నిధులు

క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌కు యాంకర్‌ నిధులు

దేశంలోనే మూడో పెద్ద సూక్ష్మ రుణ సంస్థ క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ నేడు(8న) ప్రారంభమైంది. ఇష్యూకి ముందురోజు అంటే మంగళవారం(7న) కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించింది. షేరుకి రూ. 422 ధరలో దాదాపు 80.42 లక్షల షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 339 కోట్లకుపైగా నిధులను సమకూర్చుకుంది. కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలలో న్యూబెర్గర్‌ బెర్మన్‌ ఈక్విటీ ఫండ్‌, ఈస్ట్‌స్ప్రింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌, సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ తదితరాలున్నాయి.
ఇష్యూ వివరాలు
శుక్రవారం(10న) ముగియనున్న ఐపీవోలో భాగంగా కంపెనీ 1.18 కోట్ల షేర్లను జారీ చేయనుంది. వీటితోపాటు రూ. 630 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా మొత్తం రూ. 1500 కోట్లవరకూ సమీకరించనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ.418-422కాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకేలాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కంపెనీ నేపథ్యం 
బెంగళూరు కేంద్రంగా 1991లో ప్రారంభమైన క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌.. ప్రధానంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సూక్ష్మ రుణాలను మంజూరు  చేస్తుంటుంది. కంపెనీ గతంలో ‘గ్రామీణ్‌ కూట ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రై.లి.’ పేరుతో సేవలందించేది. దేశంలోని 132 జిల్లాల్లో 516 బ్రాంచీలను కలిగివున్న క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ప్రస్తుతం 5వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, గోవా, కేరళా, ఒడిషా, పాండిచ్చేరి రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. 
కంపెనీ బలాలు 
సూక్ష్మ రుణ సంస్థల్లో మల్టీనేషనల్‌ కంపెనీగా గుర్తింపును ఈ సంస్థ కలిగివుంది. అలాగే బిజినెస్‌లో గ్రామీణ ప్రాంతం వాటా సింహభాగంగా ఉంది. మొత్తం కస్టమర్ల(21.9 లక్షలు)లో గ్రామీణ ప్రాంతంలో 18.5 లక్షల మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో 1.85 మిలియన్‌ల మంది ఉన్నారు. బలమైన నిర్వహణ సామర్థ్యాన్ని కలిగివున్న ఈ సంస్థ అతితక్కువ నిర్వహణ ఖర్చులతో చక్కని లాభాలను నమోదు చేస్తోంది. 2017లో ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్‌-8లో సంస్థల్లో ఒకటిగా నిలిచింది.Most Popular