జస్ట్ 6 నెలల్లో 200% పెరిగింది..ఇంకా లాభాలకు ఛాన్స్ ?

జస్ట్ 6 నెలల్లో 200% పెరిగింది..ఇంకా లాభాలకు ఛాన్స్ ?

నిప్టీ ఆల్‌టైమ్ హై పాయింట్ల మార్క్‌ను సవరించుకుంటూ పోతుంటే..టాటా గ్రూపులోని ఓ సంస్థ గత ఆరు నెలల్లో 200శాతం పెరిగింది. టాటా గ్రూప్ సంస్థ నెల్కో ఈ ఏడాది ఫిబ్రవరి 6న రూ.108వద్ద ట్రేడవగా..ఇప్పుడు ఏకంగా రూ.338 ధరకి చేరింది అంటే ఆరునెలల్లో 213శాతం లాభం పంచిందన్నమాట. ఇదే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ పెరిగింది పదిశాతం మాత్రమే
తాజా గరిష్టమైన 338 రూపాయలు నెల్కో సంస్థకి గత దశాబ్దకాలంలోనే అత్యధిక ధర కావడం విశేషం. నెల్కోలో టాటా పవర్ సంస్థకు 50.09శాతం వాటా ఉంది. కాగా క్యు1లో నెల్కో సంస్థ నికరలాభం మూడు కోట్ల 93 లక్షలుగా ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఖచ్చితంగా రెట్టింపుతో సమానం.నెల్కో సంస్థ ప్రధానంగా వీశాట్ వ్యాపారం చేస్తోంది. ఈ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకుని గత రెండు త్రైమాసికపు ఫలితాల్లో మంచి వృధ్ది నమోదు చేస్తోంది. అందుకే ఈ స్థాయిలో లాభం ఆర్జించింది. నెల్కో లాభం పెరగడానికి సేల్స్  పెరగడంతో పాటు, నష్టం వస్తోన్న చోట  కార్యకలాపాలు నిలిపివేయడం కూడా కారణంగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వ్యాపార వ్యూహాలను మార్చుకుంటూ పోవడం కూడా మరో కారణం.శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోని అమ్మకాలే సంస్థ మొత్తం ఆదాయంలో 98శాతానికి సమానం. అందుకే ఈ రంగంపైనే ఫోకస్ అంతా కేంద్రీకరించింది మేనేజ్‌మెంట్.

మొబలిటీ సేవలకు కేంద్రం అనుమతి ఇవ్వడం ప్రారంభిస్తే రానున్న నాలుగేళ్లలో వీశాట్ వ్యాపారం మరింత పెరుగుతుందని యాజమాన్యం భావిస్తోంది. జాగ్రఫీకి సంబంధించిన రంగంలో కూడా వీశాట్ వ్యాపారానికి మంచి అవకాశముందని తెలుస్తోంది. అందుకే సేవలు మరింత విస్తరించనున్నట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పొందుపరిచింది. చమురు రిటైల్ ఔట్‌లెట్లను ఖచ్చితంగా అనుసంధానించాలనే కేంద్రం ఆదేశం ఇప్పుడు నెల్కోకి బాగా కలిసి వస్తుందని అంచనా. వీశాట్ ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ రంగాల్లో మంచి పొజిషన్లో ఉన్న నెల్కో, కేంద్రప్రభుత్వం పథకాలు తమకి బాగా అవకాశాలు ఇస్తాయని ఆశిస్తుంది. పంచాయితీ గ్రామాలు, హెల్త్ కేర్, ప్రజా పంపిణీ వ్యవస్థ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను అనుసంధానించాలంటే వీశాట్ వ్యవస్థలే ఆధారం. వీటి కోసం కనీసం లక్ష వీశాట్‌లు అవసరమవుతాయట. అందుకే నెల్కో తన వీశాట్ వ్యాపారం ఇంకా పెరుగుతుందనే అంచనాతో ఉంది. ఇదే లెక్కతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కూడా నెల్కోపై మోజు చూపిస్తున్నారుMost Popular