లక్కు తోక తొక్కారు..ఓవర్‌నైట్ బిలీయనీర్స్ అయ్యారు

లక్కు తోక తొక్కారు..ఓవర్‌నైట్ బిలీయనీర్స్ అయ్యారు

ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ అనేది కంపెనీలు తమ ఉద్యోగులకు వాటాలు కేటాయింపు చేయడం. ఈ పధ్దతిలో సంస్థలో ఎంపిక చేసిన కొంతమంది ఉద్యోగులకు షేర్లు అలాట్ చేస్తారు. ఐతే ఇలా కేటాయించిన షేర్లు వెంటనే అమ్ముకోవడానికి వీలు ఉండదు. కొంత సమయం లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మాత్రమే అలా కుదురుతుంది. ఇలా వచ్చిన ఆఫర్ కొంతమందికి బాగా లాభం చేకూర్చుతుంది. ఉదాహరణకు నిన్న లిస్టైన హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసి ఒక్క రోజులోనే దాదాపు పదిమంది ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చింది. అఫ్ కోర్స్ వాళ్లేం మధ్యతరగతివారు కాదు అప్పటికే స్థితిమంతులు..అలాట్‌మెంట్ రోజుకే వారికి కేటాయించిన షేర్ల నిష్పత్తిలో కోటీశ్వురులు అయినా కూడా లిస్టైన తర్వాత బిలీయనీర్లుగా మారారు
HDFC AMC ఇష్యూ ధర రూ.1100 అయితే 58శాతం ప్రీమియంతో రూ.1738 దగ్గర లిస్టైంది. రోజు ముగింపు చూస్తే రూ.1815 వద్ద క్లోజైంది. దీంతో ఈ షేర్లు అలాట్ అయిన ఉద్యోగులు బిలీయనీర్లుగా మారారు. వారిలో సిఈఓ మిలింద్ బార్వే షేర్ల విలువ రూ.188కోట్లకి చేరింది. ఈయనకి సంస్థలో 10లక్షల 40వేల షేర్లు అలాట్ అయ్యాయ్. తర్వాత  సీఐఓ ప్రశాంత్ జైన్‌కి ఎనిమిది లక్షల 88వేలు షేర్లు కేటాయించగా., వాటి విలువ రూ.161కోట్లకి చేరింది. ఇక మిగిలిన ఉద్యోగుల షేర్ల విలువ ఎలా ఎగసిందో ఈ కింద ఫోటోలో చూడండిMost Popular