నిఫ్టీ 11600కు వెళ్తే ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..

నిఫ్టీ 11600కు వెళ్తే ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి..

గత వారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన దేశీయ మార్కెట్లో చివర్లో భారీ లాభాలను నమోదు చేశాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు, అంతర్జాతీయ పరిణామాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ వివిధ కంపెనీల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో మార్కెట్లకు కొనుగోళ్ళ మద్దతు లభించింది. ఫార్మా, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు మార్కెట్‌ అప్‌ట్రెండ్‌కు టాప్‌ కంట్రిబ్యూటర్స్‌గా ఉన్నాయి. దీంతో త్వరలోనే నిఫ్టీ 11600 మార్కుకు చేరుకోవచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే నిఫ్టీ ఈ లెవెల్స్‌కు చేరితే వేటిని కొనుగోలు చేస్తే మంచిదో రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌(రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌) జయంత్‌ మాంగ్లిక్‌ కొన్ని స్టాక్స్‌ను రికమండ్‌ చేస్తున్నారు. 

Pidilite Industries: Buy | Target: Rs 1,210 | Stop loss: Rs 1,050 | Return: 10%

ఈ ఏడాది మేలో రికార్డు స్థాయి గరిష్టానికి(రూ.1195.40) చేరిన పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం రూ.1100 లెవెల్స్‌లో కదలాడుతోంది. డైలీ ఛార్ట్‌ప్రకారం చూస్తే ప్రస్తుత లెవెల్స్‌ నుంచి ఈ స్టాక్స్‌లో అప్‌ట్రెండ్‌ కనిపిస్తోంది. గత నెల్లో ఈ స్టాక్‌లో బ్రేకవుట్‌ వచ్చింది. ప్రస్తుత లెవెల్స్‌లో ఈ స్టాక్‌ కొనుగోలుకు అనుకూలమైనదిగా చెప్పొచ్చు. రూ.109-1100 రేంజ్‌లో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయొచ్చు. వచ్చే నెల రోజుల్లో ఈ స్టాక్‌ 7-10 రిటర్న్స్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. 

Dewan Housing Finance Corporation: Buy | Target: Rs 680| Stop loss: Rs 590| Return: 9.14%

రికార్డు స్థాయి గరిష్టం 680.55 నుంచి కరెక్షన్‌కు గురై ప్రస్తుతం దిద్దుబాటు ధోరణిలో కదలాడుతోంది DHFC. గత మూడు నెలలుగా రూ.580-640 లెవల్స్‌ రేంజ్‌లో ఈ స్టాక్‌ ట్రేడవుతోంది. ఛార్ట్‌ ప్యాట్రన్‌ ప్రకారం చూస్తే ప్రస్తుత లెవల్స్‌లో ఈ స్టాక్‌ అప్‌ట్రెండ్‌ కనిపిస్తోంది. ట్రేడర్లు రూ.618-623 మధ్య కొత్త లాంగ్‌ పొజీషన్లను తీసుకోవచ్చు. వచ్చే నెల రోజుల్లో ఈ స్టాక్‌ 9-10 శాతం రిటర్న్‌ అందించే ఛాన్స్‌ వుంది. 

Ujjivan Financial Services: Buy | Target: Rs 430 | Stop loss: Rs 384| Return: 7.5%

గత రెండేళ్ళుగా ఈ స్టాక్‌ విస్తృత శ్రేణిలో కదలాడుతోంది ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌. వీక్లీ ఛార్ట్‌ ప్రకారం చూస్తే 100 ఈఎంఏ వద్ద స్ట్రాంగ్‌ సపోర్ట్‌ జోన్‌ను కలిగివుంది. అన్ని సూచికలు తాజా పెరుగుదలకు అనుకూలంగా ఉన్నాయి. ఈ దశను ట్రేడర్లు ఉపయోగించేకోవాలని జయంత్‌ మాంగ్లిక్‌ సూచిస్తున్నారు. రూ.395-400 శ్రేణిలో కొత్త లాంగ్‌ పొజిషన్లను తీసుకుంటే మంచిది. వచ్చే నెల రోజుల్లో ఈ స్టాక్‌ 7.5శాతం రిటర్న్‌ అందించే అవకాశముంది. 

గమనిక : పైన ఇచ్చిన రికమండేషన్స్‌ అన్నీ అవగాహన కోసం మాత్రమే. లావాదేవీలకు సంబంధించి ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్‌ డాట్‌ఇన్‌కు ఎలాంటి సంబంధం లేదు. Most Popular