ఆరంభమే 60% లాభంతో అదిరింది.. ప్లస్ పాయింట్లు చూడండి

ఆరంభమే 60% లాభంతో అదిరింది.. ప్లస్ పాయింట్లు చూడండి

హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిస్టింగ్ ఇవాళ అదరహో అన్పించింది. ఓపెనింగ్‌తోనే దాదాపు రూ.38700కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించింది. ఇష్యూ ధర రూ.1100కాగా, రూ.1739 వద్ద లిస్ట్ అయింది. అంటే 66శాతం లాభం పంచింది ఇంట్రాడేలో రూ.1832 వరకూ వెళ్లి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఈ సంవత్సరం లిస్టై భారీగా లాభం పంచిన స్టాక్స్‌లో ఇది సెకండ్ బెస్ట్ అయింది. జనవరి 22న లిస్టైన అపోలో మైక్రో సిస్టమ్స్ 73.82శాతం ప్రీమియం సాధించింది.

మొత్తం రూ.2800 కోట్ల రూపాయల సైజుతో ఐపిఓకి వచ్చిన హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసి ఐపీఓ జూలై 25-27 మధ్య రాగా, 83శాతం సబ్‌స్క్రైబ్ అయింది.ఇదే రంగంలో ఉన్న రిలయన్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్‌మెంట్ రూ.1542కోట్ల ఐపిఓ కాగా, లిస్టింగ్ ప్రీమియం మాత్రం 17శాతం మాత్రమే దక్కించుకుంది.గత ఐదేళ్లను తరచిచూస్తే, ఐపిఓలకు మంచి స్పందనే లభిస్తూ వస్తోంది. సగటున ప్రతి ఐపిఓకి 56శాతం ఆరంభపు లాభాలు దక్కుతున్నాయ్.హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసి సంస్థ దాదాపు రూ.3లక్షలకోట్ల విలువ కలిగిన ఫండ్లను నిర్వహిస్తోంది. ఇండస్ట్రీ వృధ్ధి రేటు 43.2శాతం నమోదు చేస్తుంటే,హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మాత్రం 51.3శాతం వృధ్ది  సాధించడం విశేషం. ఇదే ఈ సంస్థపై ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మక్కువ పెంచుకోవడానికి కారణంగా అర్ధం చేసుకోవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసికి దేశవ్యాప్తంగా 209 శాఖలు, 65వేల డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ ఉన్నది. బలమైన రాబడి నిష్పత్తి, డివిడెండు చెల్లింపు చరిత్ర,,గత లాభాల రికార్డు ఘనంగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసి అనేది స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటైన సంస్థ. ఏఎంసి మార్కెట్‌లో హెచ్‌డిఎఫ్‌సికి 13.07శాతం వాటా ఉండగా..ఈక్విటీ ఓరియెంటెడ్ విభాగంలో 16.8శాతం వాటా ఉంది. కథనం రాసే సమయానికి హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసి 64.22శాతం లాభపడి రూ.1806.45 వద్ద ట్రేడవుతోంది.

అంబర్ ఎంటర్‌ప్రైజెస్ 37.37శాతం, బంధన్ బ్యాంక్ 29.33శాతం, లెమన్ ట్రీ హోటల్స్ 10శాతం ప్రీమియంతో లిస్టైన ఇతర కంపెనీలు కాగా ఆయా వివరాలు కింది ఫోటోలో చూడండిMost Popular