ఇవాళ్టి నుంచే క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్ ఐపీఓ.. పూర్తి వివరాలిదిగో..

ఇవాళ్టి నుంచే క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్ ఐపీఓ.. పూర్తి వివరాలిదిగో..

దేశంలోని రెండో అతిపెద్ద సూక్ష్మ రుణ సంస్థ క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ఇవాళ ఐపీఓకు రాబోతోంది. ఇష్యూలో భాగంగా 1.02 కోట్ల షేర్లను జారీ చేసి సుమారు రూ.1130కోట్ల నిధులను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ.900 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ఇష్యూ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.418-422గా ఉంది. రిటైల్‌ పోర్షన్‌ వాటా 35శాతంగా ఉంది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌​, క్రెడిట్‌ సూసీ సెక్యూరిటీస్‌(ఇండియా), ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. 

కంపెనీ నేపథ్యం :
బెంగళూరు కేంద్రంగా 1991లో ప్రారంభమైన ఈ కంపెనీ ఇంతకుముందు  ‘గ్రామీణ్‌ కూట ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రై.లి.’ పేరుతో సేవలందించేది. 2017 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో సంస్థకు 16 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. దేశంలోని 132 జిల్లాల్లో 516 బ్రాంచీలను కలిగివున్న క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌ ప్రస్తుతం 5వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, గోవా, కేరళా, ఒడిషా, పాండిచ్చేరి రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. 

కంపెనీ బలాలు : 
సూక్ష్మ రుణ సంస్థల్లో మల్టీనేషనల్‌ కంపెనీగా గుర్తింపును ఈ సంస్థ కలిగివుంది. అలాగే బిజినెస్‌లో గ్రామీణ ప్రాంతం వాటా సింహభాగంగా ఉంది. మొత్తం కస్టమర్ల(2.19 మిలియన్లు)లో గ్రామీణ ప్రాంతంలో 1.85 మిలియన్‌ల మంది ఉన్నారు. బలమైన నిర్వహణ సామర్థ్యాన్ని కలిగివున్న ఈ సంస్థ అతితక్కువ నిర్వహణ ఖర్చులతో చక్కని లాభాలను నమోదు చేస్తోంది. 2017లో ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే టాప్‌-8లో సంస్థల్లో ఈ సంస్థ ఒకటి. 

ఫైనాన్షియల్స్‌ :
గత ఐదేళ్ళుగా కంపెనీ పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. నికరలాభంలో భారీ వృద్ధి నమోదు అవుతోంది. పూర్తి వివరాలు దిగువ ఇచ్చిన పట్టికలో చూడండి. 

ఐపీఓ ముఖ్యాంశాలు..
ప్రారంభం : ఆగస్ట్‌ 8, 2018
ముగింపు : ఆగస్ట్‌ 10, 2018
ఇష్యూ సైజు : సుమారు రూ.1130 కోట్లు
ముఖ విలువ : ఒక్కో షేరుకు రూ.10
ధరల శ్రేణి : ఒక్కో షేరుకు రూ.418-422
రిటైల్‌ పోర్షన్‌ వాటా : 35 శాతం
జారీ చేసే ఈక్విటీ షేర్లు : 1,02,81,317 షేర్లు
లాట్‌ : కనీసం 35 షేర్లకు(రూ.14,770) దరఖాస్తు చేయాలి
షేర్ల కేటాయింపు : ఆగస్ట్‌ 16, 2018
రీ ఫండ్‌ : ఆగస్ట్‌ 20, 2018
డీమ్యాట్‌లో షేర్ల క్రెడిట్‌ : ఆగస్ట్‌ 21, 2018
లిస్టింగ్‌ : ఆగస్ట్‌ 23, 2018న (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో)Most Popular