ఈ 3 స్టాక్స్ ఇవాళే 10% లాభం ఇస్తాయట?!

ఈ 3 స్టాక్స్ ఇవాళే 10% లాభం ఇస్తాయట?!

ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలు అయి కొత్త గరిష్టాలు నమోదు అవడం ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఇలాంటి దశలో కునాల్ బోత్రా రానున్న రోజుల్లో కూడా మార్కెట్లు లాభాల్లోనే ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్‌గా కూడా సానుకూల సంకేతాలే కన్పిస్తున్నాయని ఆయన చెప్తున్నారు. ఇవాల్టి ట్రేడింగ్ కోసం ఓ మూడు కంపెనీల షేర్లను రికమండ్ చేస్తున్నారు

హిందాల్కో  : CMP : రూ. 211.70 TARGET  Rs.230  STOP LOSS Rs.204
వాటిలో మొదటిది హిందాల్కో ..ఇది మెటల్ ప్యాక్‌లో మంచి మొమెంటమ్ కనబరుస్తున్న కంపెనీ. పైకి కిందకూ ఊగులాడుతున్నా కూడా ఈ షేరును ప్రస్తుత ధరలో కొనుగోలు చేస్తే రూ.230 వరకూ పెరుగుతుందని కునాల్ బోత్రా సూచిస్తున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:  CMP: 298.60   TARGET Rs.320  STOP LOSS: RS. 289
ఇక రెండో షేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీక్లీ ఛార్టులలో స్ట్రాంక్ బ్రేకవుట్ నమోదు చేసిందని కునాల్ చెప్తున్నారు. రూ.290వద్ద  బ్రేకవుట్‌తో ఎస్‌బిఐ 200 రోజుల చలన సగటును ( 200DMA)ను అధిగమించి ట్రేడైంది. ఇప్పుడు కొనుగోలు చేస్తే ప్రస్తుత ధర నుంచి రూ. 320వరకూ షేరు పెరుగుతుందని చెప్తున్నారు. స్టాక్ స్టాప్‌లాస్ రూ.289

బాంబే బర్మా ట్రేడింగ్: CMP : 1614.25,  TARGET Rs.1700-1720, STOP LOSS Rs.1555
మిడ్‌క్యాప్‌ స్టాక్ కేటగరీలో బ్రేకవుట్ కనబరిచిన మరో స్టాక్ బాంబే బర్మా ట్రేడింగ్. ఈ  స్టాక్‌ని పొజిషినల్ బయింగ్‌తో రూ.1700-1720 టార్గెట్ ఫిక్స్ చేసుకుని కొనుగోలు చేయమంటున్నారు. స్టాక్ స్టాప్‌లాస్ రూ.1555గా పెట్టుకోమని కునాల్ బోత్రా సూచన

వీటితోపాటుగా..కొన్ని స్టాక్స్‌పై తన అభిప్రాయాలను వెల్లిబుచ్చారు. ఐషర్ మోటర్స్ దాదాపు ఎనిమిదేళ్ల కనిష్టస్థాయికి పతనమైన నష్టపోయిన నేపధ్యంలో షేరు ఇంకాస్త నష్టపోతుందని చెప్తున్నారు. ఆయన సూచనని బట్టి చూస్తే, ఐషర్ మోటర్స్ డౌన్‌ట్రెండ్‌లో ఉన్నది. షేరు రూ.27వేల ధరకంటే నష్టపోతే,స్టాక్‌లో కరెక్షన్ మొదలైనట్లే..! రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయమే తీసుకుంటే, గత 9-10ఏళ్లలో కనబరిచిన సైడ్‌వేస్ ధోరణి ముగిసినట్లే కన్పిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో షేరు ఇంకా లాభపడే సూచనలు కన్పిస్తున్నాయని బోత్రా అభిప్రాయపడ్డారుMost Popular