నేడు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లిస్టింగ్‌

నేడు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ లిస్టింగ్‌

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) సోమవారం లిస్ట్‌కానుంది. షేరుకి రూ. 1100 ధరలో ఐపీవో పూర్తిచేసుకున్న కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించింది. కాగా.. ఐపీవోకు అనూహ్య స్పందన లభించింది. ఇష్యూ ఏకంగా 83 రెట్లు అధికంగా సబ్‌స్ర్కయిబ్‌ అయ్యింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) విభాగంలో 192 రెట్లు, సంపన్న వర్గాల(హెచ్‌ఎన్‌ఐలు) నుంచి 195 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం దాదాపు 7 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. కంపెనీ 1.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 156 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ వెల్లువెత్తడం విశేషం!
ప్రీమియం లిస్టింగ్‌?
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఇష్యూ 83 రెట్లు అధికంగా సబ్‌స్ర్కయిబ్‌ అయిన నేపథ్యంలో షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో తొలి రోజు భారీ ప్రీమియంతో లిస్టయ్యే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇష్యూ ధర రూ. 1100 కాగా కనీసం 30 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అనధికార మార్కెట్లో షేర్లు రూ. 500-600 ప్రీమియం పలుకుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వెరసి రూ. 1400-1600 మధ్య లిస్ట్‌కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తుండటం విశేషం!Most Popular