మీ క్రెడిట్ కార్డ్‌తో డబ్బు ఆదా ఎలా చేసుకోవచ్చా తెలుసా..?

మీ క్రెడిట్ కార్డ్‌తో డబ్బు ఆదా ఎలా చేసుకోవచ్చా తెలుసా..?

పేమెంట్ యాప్స్ వచ్చినా కూడా క్రెడిట్ కార్డ్స్ లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొద్దిపాటి అవసరాల నుంచి రూ.50వేల వరకూ ఎవరి వద్దా చేయి చాచకుండా దర్జాగా ఖర్చు పెట్టగల సౌలభ్యం వీటివలన కలుగుతుంది. ఇక లిమిట్ కనుక ఓ రెండు లక్షల రూపాయలు ఉందంటే క్రెడిట్ కార్డ్‌ని మించిన లోన్ లెండర్ ఉండరు. ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక ఉంటే లక్ష రూపాయల రొటేషన్ చేయవచ్చు. పేమెంట్ యాప్స్‌తో రకరకాల ఆఫర్లు  ఊరిస్తున్నా..క్రెడిట్ కార్డ్స్ వాడకం ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా కొద్దిమందికి క్రెడిట్ కార్డ్స్ వాడటం వలన డబ్బు ఆదా అవుతుందని అలా చేసుకునే మార్గాల గురించి తెలీదు. అలాంటి ఓ ఐదు చిట్కాలు ఇప్పుడు చూద్దాం
ఈ-కామర్స్ డీల్స్ 
ఫస్ట్ మన మనసులోకి క్రెడిట్ కార్డ్స్ వాడకం గురించిన ఆలోచన వచ్చేది ఈ కామర్స్ సైట్స్ ఆఫర్ సేల్స్ కనబడగానే మాత్రమే. క్యాష్ పేమెంట్ల కంటే కూడా క్రెడిట్‌కార్డ్ పేమెంట్స్ ద్వారా కొనుగోలు చేస్తే ఆపిల్ ఫోన్ కూడా ఎంఐ ఫోన్ ధరకి వచ్చేంత డిస్కౌంట్లు కన్పిస్తుంటాయ్. ఐతే వీటిని జాగ్రత్తగా చదివి మాత్రమే కొనుగోలు చేయాలి/ఒక్కో ఈకామర్స్ కంపెనీ ఒక్కో ప్రొడక్ట్‌పై ఒక్కో బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో టై అప్ అయి డిస్కౌంట్ల ప్రకటనలు ఇవ్వడం గమనిస్తుంటాం. వీటిలో కొన్ని అయితే వడ్డీ లేని ఈఎంఐలు(నెలవాయిదా) కట్టుకునే అవకాశం కూడా ఇస్తాయి. షాపుల్లో కొనుగోలు చేసే వస్తువుల రేట్లు కంటే ఇక్కడ 10-20శాతం తగ్గడం మనకి పొదుపు అయినట్లే కదా


రివార్డ్ పాయింట్స్ 
క్రెడిట్ కార్డ్స్ వాడిన ప్రతిసారీ రివార్డ్ పాయింట్లు వచ్చినట్లు మెసేజ్‌లు వస్తుంటాయ్. చాలామందికి వీటి వలన ప్రయోజనం ఏంటని అనుకుంటారు. ఐతే కార్డు ఇష్యూ చేసిన బ్యాంకుని బట్టి..కార్డుని బట్టి ప్రతి కొనుగోలుపై 0.2 నుంచి 0.75 పాయింట్లు వస్తుంటాయి.  ఇవన్నీ కలిపి ఏడాదికి కొన్ని వందల పాయింట్లు అవుతాయి. కొన్ని క్రెడిట్ కార్డులు ఈ  రివార్డు పాయింట్లని తిరిగి క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసే సదుపాయం కల్పిస్తున్నాయ్. అందుకే రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్ అనే అంశాన్ని స్పష్టంగా చదవగలిగితే ఎక్స్‌ట్రా బెనిఫిట్  పొందవచ్చు. 


కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్ట్
రివార్డు పాయింట్లకు తర్వాతి దశగా ఈ కార్డులను అనుకోవచ్చు. రెగ్యులర్‌గా కొన్ని సర్వీసులు కనుక పొందుతున్నట్లైతే..కొన్ని క్రెడిట్ కార్డులు ఆయా సంస్థలతో కలిసి కో బ్రాండెడ్ కార్డులు ఇష్యూ చేస్తాయి. ఇలాంటివి మీకు బిగ్ బజార్, రిలయన్స్ మార్ట్ వంటి దుకాణాల్లో మార్కెటింగ్ సిబ్బంది కొనుగోలు చేయాల్సిందిగా వెంటపడటం తటస్థిస్తే గమనించవచ్చు. ఐతే ఈ సేవలు మనం ఎక్కువగా వాడుతున్నామని రూఢి చేసుకున్న తర్వాతే ఎంచుకోవాలి


క్యాష్ బ్యాక్
డబ్బెవరికి చేదు, ఖర్చు పెట్టిన డబ్బులో కొంత వెనక్కి తిరిగి ఇవ్వడమనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్నదే..ఐతే ఇలాంటివి ఎక్కడబడితే అక్కడ కాకుండా..డి-మార్ట్ లాంటి చవకగా వస్తువులు దొరుకుతాయని ప్రచారం ఉన్నచోట చేస్తే..మనం కొనుగోలు చేసిన ధరలో తిరిగి మళ్లీ ఇంకాస్త రాబట్టినట్లుంటుంది..ఐతే కొన్నవస్తువు ఖచ్చితంగా బైటి మార్కెట్‌లో కనీసం 10శాతం ఎక్కువ ధర ఉందని తెలిస్తేనే ఇలాంటి చోట్ల షాపింగ్ చేయాలి..అప్పుడే క్యాష్ బ్యాక్ రూపంలో అత్యధిక ప్రయోజనం పొందగలం. ఇక్కడే షరతులు వర్తించబడును అనే కాలమ్ కూడా పూర్తిగా చదవాలి..మనం చేసే షాపింగ్ 1000 రూపాయలు దాటాలనో..లేదా అత్యధికంగా పొందే క్యాష్ బ్యాక్ రూ.250 మాత్రమే అనో కండిషన్స్ ఉంటాయ్. అలాంటప్పుడు ఏకబిగిన ఎగబడి ఓ 10వేల రూపాయలకు కొనుగోలు చేయవద్దు అలానే కొన్ని కంపెనీలు కేవలం నెలలో క్యాష్ బ్యాక్ సదరు అక్కౌంట్ హోల్డర్‌కి ఒకసారో, రెండుసార్లకో పరిమితి విధించాడనుకోండి..మనం బుక్కైపోయినట్లే కదా


క్రెడిట్ స్కోర్ బిల్డింగ్
క్రెడిట్ స్కోర్ బావుండాలన్నా..కార్డు వాడకమే కీలకం. ఎక్కడా వాయిదా తప్పకుండా..వడ్డీ జరిమానా అనేదే లేకుండా కార్డు వాడిన వాళ్లకి సిబిల్ స్కోరు ఆటోమేటిగ్గా..మంచిగా ఉంటుంది..అలా మంచి స్కోరు ఉన్నవాళ్లకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పు ఇవ్వడానికి బ్యాంకులు, టూవీలర్ కంపెనీలు..ఫోర్ వీలర్ కంపెనీలు సిధ్దంగా ఉంటాయి. ఇళ్ల ఋణాలు, వ్యక్తిగత ఋణాలకు కూడా ఇదే చూస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు వాడకమే సిబిల్ స్కోర్ పొందడంలో ప్రధాన పాత్ర అంటే అతిశయోక్తి కాదు ఐతే సిబిల్ స్కోర్  ఎలాగైతే ఓ వాడకందారు క్రమశిక్షణ గురించి తెలియజేస్తుందో..ఎడా పెడా వాడకం వారి బలహీనతలకు అద్దం పడుతుంది.కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని క్రెడిట్ కార్డు వాడినప్పుడు జీవితం ఆనందమయం అవుతుందిMost Popular