ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఫెడ్‌ పాలసీ-యథాతథం!

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఫెడ్‌ పాలసీ-యథాతథం!

అంచనాలకు తగినట్లే కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ యథాతథ పాలసీ అమలును ప్రకటించింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 1.75-2 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశాలలో భాగంగా బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి) ఫెడ్‌  పరపతి నిర్ణయాలను ప్రకటించింది. ఫలితంగా 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ జూన్‌ తరువాత మళ్లీ 3 శాతాన్ని తాకాయి. కాగా.. జులైలో ప్రయివేట్‌ రంగంలో అంచనాలను మించుతూ 2.19 లక్షల మందికి ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ తాజాగా గణాంకాలు విడుదల చేసింది.  
సెప్టెంబర్‌లో పెంపు?
ఈ ఏడాది(2018) రెండో త్రైమాసికంలో(ఏప్రిల్‌-జూన్‌)లో అమెరికా జీడీపీ 4.1 శాతం పురోగమించగా.. జూన్‌ చివరికల్లా ద్రవ్యోల్బణం 2.2 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నదని, ఉపాధి మార్కెట్‌ పటిష్టమైందని, ద్రవ్యోల్బణం సైతం లక్ష్యానికి దగ్గరగా ఉన్నదని ఫెడ్‌ కమిటీ తాజాగా అభిప్రాయపడింది. సమీప భవిష్యత్‌లో ధరలు టార్గెట్‌ను మించిపోయే అవకాశంలేదని, దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత వేడెక్కేందుకు వీలుగా ప్రస్తుతానికి యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్‌, డిసెంబర్‌ సమీక్షలలో మరోరెండుసార్లు ఫెడ్‌ కమిటీ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. Most Popular