ర్యాలీకి సిద్ధంగా ఉన్న స్టాక్స్‌ ఇవే.. తొందరపడండి..

ర్యాలీకి సిద్ధంగా ఉన్న స్టాక్స్‌ ఇవే.. తొందరపడండి..

దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ రంకెలు వేయడంతో సరికొత్త శిఖరాలకు నిఫ్టీ, సెన్సెక్స్‌ చేరడంతో ప్రస్తుతం మళ్ళీ ఆశలు చిగురిస్తున్నారు. గతంలో ఓ ఊపుఊపిన 63 స్టాక్స్‌ గత కొంతకాలంగా ఢీలా పడి ఇన్వెస్టర్లకు కన్నీళ్ళు తెప్పించాయి. ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తేందుకు ఆయా స్టాక్స్‌ ర్యాలీకి సిద్ధమయ్యాయని మొమెంటమ్‌ ఇండికేటర్‌ మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జెన్స్‌ డైవర్జెన్స్‌(MACD) సూచిస్తోంది. వర్షపాతం సాధారణంగా ఉండటం, పలు వస్తువులపై జీఎస్టీ రేట్ల తగ్గింపు మార్కెట్లకు బూస్టింగ్‌నిచ్చే అంశమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

గతంలో భారీ కరెక్షన్‌కు గురై ఇప్పుడిప్పుడే ఆశల్లో ముంచెత్తున్న పీసీ జ్యువెలర్స్‌, జేపీ అసోసియేట్స్‌, ఉషా మార్టిన్‌, అరబిందో ఫార్మా, వొకార్డ్‌, మనాలి పెట్రోకెమ్‌, రుచి సోయా, బన్సారీ ఇంజనీరింగ్‌, గ్రీవ్స్‌ కాటన్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌లు ర్యాలీకి సిద్ధమయ్యాయి. ఇటీవల ఈ కంపెనీల వాల్యూమ్స్‌ అన్నీ భారీగా నమోదు కావడం దీనికి బలాన్ని చూకూరుస్తోంది. 

MACD ఛార్ట్స్‌ ప్రకారం బుల్లిష్‌ను ఇండికేట్‌ చేస్తోన్న మరికొన్ని స్టాక్స్‌ :
రికో ఆటో ఇండస్ట్రీస్‌, త్రివేణి ఇంజనీరింగ్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌, ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, పెన్నార్‌ ఇండస్ట్రీస్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, బీఎల్‌ కాశ్యప్‌ అండ్‌ సన్స్‌, భారత్‌ డైనమిక్స్‌.

MACD సిగ్నల్‌ లైన్‌ను క్రాస్‌ చేసిన స్టాక్స్‌ అన్నీ బుల్లిష్‌గా ఉన్నట్టే. ఆ స్టాక్స్‌ ఏంటో దిగువ పట్టికలో చూడండి.


గమనిక : ఈ స్టాక్స్‌ అవగాహన కోసం మాత్రమే. లావాదేవీలకు ప్రాఫిట్‌ యువర్‌ ట్రేడ్‌ డాట్‌ఇన్‌కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.Most Popular