కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి..?

కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి..?

డబ్బు బాగా సంపాదించాలని, ఐశ్వర్యవంతులు కావాలని చాలామందికి ఉంటుంది. ఐతే ఇందుకు కావాల్సిందల్లా ప్లానింగ్ అంటారు కొంతమంది పండితులు. స్టాక్ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేసి కరోడ్‌పతి అన్పించుకోవాలనుకునేవారికి కొన్ని సలహాలు ఇస్తున్నారు వారు ఇండిపెండెంట్ అనలిస్ట్ క్షితిజ్ ఆనంద్ అభిప్రాయం ప్రకారం సూచీలు గరిష్టాన్ని తాకుతున్నా కూడా ఇంకా మంచి స్టాక్స్‌ కొన్నిటిలో పెట్టుబడి పెడితే కౌన్ బనేగా కరోడ్‌పతి డ్రీమ్ రన్‌లో గెలవవచ్చని చెప్తున్నారు.


"చాలామంది ఇన్వెస్టర్లు పోర్ట్‌ఫోలియో బాగా దెబ్బతిన్నదని బాధపడుతున్నారు. వాళ్లంతా ఆల్ఫా లాభాలు కోసం వెంపర్లాడారు. అంటే ఇండెక్స్‌ల లాభం కంటే వీళ్ల స్టాక్స్ ఎక్కువ రిటర్న్స్ కావాలని భావించారు. గతంలో వచ్చిన బుల్‌రన్ స్మాల్ క్యాప్  మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టగా మంచి లాభాలు కన్పించాయ్. ఐతే ఇప్పుడలా పరిస్థితి లేదు" అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్, రీటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసానీ అభిప్రాయపడ్డారు

ఇక విషయంలోకి వస్తే మీరు 30-40 వయసు మధ్య ఉన్నవారైతే ఐదు నుంచి పదిశాతం వరకూ తమ పెట్టుబడిని బంగారంలో 20-25శాతం డబ్బును బాండ్లలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అది కూడా డైరక్ట్‌గా బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో.. 20-25శాతం ధనాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి అని దీపక్ జాసానీ సూచిస్తున్నారు. ఐతే ఇది కూడా కాలక్రమేణా బిల్డప్ చేసుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి ఏకమొత్తంగా పెట్టుబడిని దింపేయకూడదు. ఈక్వీటిలో పెట్టే పెట్టుబడిని విడతలవారీగా కరెక్షన్లలో మాత్రమే అంటే 20-30శాతాలుగా లెక్క చేసుకుని ఇన్వెస్ట్ చేయాలట.

ఇప్పుడు రికార్డు స్థాయిల వద్ద మార్కెట్ ట్రేడవుతుంది కాబట్టి ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇంకొంతమంది అనలిస్టుల సూచనలు చూద్దాం

జిమీత్ మోడీ, శాంకో సెక్యూరిటీస్ సీఈఓ
ఈయన అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం లార్జ్ క్యాప్స్ ‌కి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌కి తేడా భారీగా ఉంది. అందుకే ఇన్వెస్టర్లకు జిమీత్ మోడీ లగార్డ్స్‌గా ఉండిపోయిన స్టాక్స్‌లో మీడియం టర్మ్ దృష్టితో ట్రేడింగ్‌కి దిగాలని సూచిస్తున్నారు. భారీగా పెరిగి పోయిన లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే ఇవే బెటర్ అంటాడాయన. ఎక్కడైనా ఇక రిస్క్ ఎపటైట్ అనేది చూసుకోవడమనేది షరాగా పెట్టుకోవాలి. ఈయన అభిప్రాయం ప్రకారం 40 ఏళ్ల వ్యక్తులు తమ పొదుపు లేదంటే పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో 10శాతం బంగారానికి. 20శాతం బాండ్లు, 40 శాతం లార్జ్ క్యాప్స్, 15శాతం స్మాల్ క్యాప్, 15శాతం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలంటున్నారు.


రితేష్ అషర్, కేఐఎఫ్ఎస్ ట్రేడ్ కేపిటల్
ఈయన అంచనా ప్రకారం 60శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలట..ఐతే ఇందులో కూడా తిరిగి 65-70శాతం లార్జ్ క్యాప్స్,  20 శాతం మిడ్‌క్యాప్స్ 10-15శాతం స్మాల్ క్యాప్‌లో పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 15శాతం అంటే ఈక్విటీల ఇన్వెస్ట్ మెంట్ కేటాయింపు కాకుండా మిగిలిన 15శాతం డెట్ ఫండ్స్ మరో 20శాతం గోల్డ్ ‌లో పెట్టుబడి చేయాలని సూచిస్తున్నారు. ఓ ఐదు శాతం క్యాష్ రెడీగా ఉంచుకుని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కొనుగోలుకు సిధ్దంగా ఉండాలని రితేష్ అషర్ చెప్తారు

సుమిత్ బిల్గ్యాన్ , ఈక్విటీ 99 రీసెర్చ్ ఫౌండర్
ప్రస్తుతం ఉన్న దశలో ఫండమెంటల్స్ బాలేని కంపెనీలనుంచి బైటకి రమ్మని సుమిత్ బిల్గ్యాన్ సూచిస్తున్నారు.ఐతే రేట్లు బాగా పడిపోయాయని మాత్రమే ఇలా చేయవద్దని చెప్పారాయన. ఈయన పద్దతి ప్రకారం 70శాతం ఈక్విటీలలో, మిగిలిన మొత్తం గోల్డ్ , బాండ్లలో సమానంగా పెట్టుబడి పెట్టాలంటారు. ఈక్విటీల్లో కూడా, 50, 40, 10 శాతాల చొప్పున వరసగా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని సుమిత్ సూచిస్తున్నారు.ఇంతే కాకుండా మ్యూచువల్ ఫండ్ల రూపంలోనూ ఈక్విటీ ఇన్వెస్ట్ చేయవచ్చని చెప్పారాయన. బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో 30శాతం , 50శాతం లార్జ్ క్యాప్, 20శాతం డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని సుమిత్ అంచనా.Most Popular