ఈ స్టాక్స్‌ను తగ్గినప్పుడల్లా కొనండి..

ఈ స్టాక్స్‌ను తగ్గినప్పుడల్లా కొనండి..

గతవారం ఆల్‌టైమ్‌ రికార్డు గరిష్టానికి చేరిన దేశీయ సూచీలు ఈవారం కూడా జోరుమీదున్నాయి. వివిధ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల సపోర్ట్‌ లభించడంతో దాదాపు అన్ని సెక్టార్లు లాభాల ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ సమయంలో ఏ స్టాక్స్‌ కొంటే లాభాలను ఒడిసిపట్టుకోవచ్చో రిలిగేర్‌ బ్రోకింగ్‌కు చెందిన మార్కెట్‌ నిపుణులు జయంత్‌ మాంగ్లిక్‌ కొన్ని స్టాక్స్‌ను సూచిస్తున్నారు. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే 1-2 నెలల్లో 6-10శాతం రిటర్న్‌ ఖాయమని ఆయన అంచనా వేస్తున్నారు. 

Century Textiles & Industries: Buy | Target: Rs 1,030 | Stop loss: Rs 890 | Return 9.57%

గత రెండు నెలలుగా నారో రేంజ్‌లో సెంచురీ టెక్స్‌టైల్స్‌ కదలాడుతోంది. వీక్లీ ఛార్ట్‌ ప్రకారం 200-EMA చక్కని సపోర్ట్‌ జోన్‌గా ఉంది. ఛార్ట్‌ ప్యాట్రన్‌ ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌ మరింత పెరిగే అవకాశముంది. రూ.930-940 రేంజ్‌లో ఈ స్టాక్‌ను తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ స్టాక్‌ టార్గెట్‌ దర రూ.1,030.

Petronet LNG: Buy | Target: Rs 252 | Stop loss: Rs 218 | Return 9.48%

దాదపు 8 నెలల కరెక్షన్‌ దశ తర్వాత పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీలో బ్రేకవుట్‌ వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌కు స్ట్రాంగ్‌ బయింగ్‌ మూమెంట్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. ట్రేడర్లు ఇప్పటికే ఈ ఛాన్స్‌ మిస్‌ అయితే తాజాగా కొత్త పొజీషన్లు రూ.226-230 రేంజ్‌లో తీసుకోవాలి. వచ్చే 1-2 నెలల్లో ఈ స్టాక్‌ 9.48 శాతం రిటర్న్‌ అందించే అవకాశముంది. 

Yes Bank: Buy | Target: Rs 395 | Stop loss: Rs 354| Return 6.75%

రికార్డు స్థాయి గరిష్టం నుంచి 10శాతం పైగా నష్టపోయిన యెస్‌ బ్యాంక్‌ మళ్ళీ రేంజ్‌ బౌండ్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఓవరాల్‌ ఛార్ట్‌ సరళిని పరిశీలిస్తే ప్రస్తుత లెవెల్స్‌లో చక్కని బయింగ్‌ సపోర్ట్‌ ఉంది. రూ.365-370 రేంజ్‌లో కొత్త పొజిషన్లను తీసుకోవడం ఉత్తమం. వచ్చే 1-2 నెలల్లో ఈ స్టాక్‌ రికార్డు స్థాయి గరిష్టం రూ.395కి చేరుకునేలా కనిపిస్తోంది.

గమనిక : ఈ స్టాక్స్ కేవలం అవగాహన కోసం మాత్రమే. లావాదేవీలకు PROFITYOURTRADE.INకు ఎలాంటి సంబంధం లేదు. Most Popular