రికార్డుల ర్యాలీలో 7-10 శాతం లాభాలు పంచే 2 స్టాక్స్

రికార్డుల ర్యాలీలో  7-10 శాతం లాభాలు పంచే 2 స్టాక్స్

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో ట్రేడవుతున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ సూచీల కదలికలతో పాటు దేశీయ పరిణామాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. అయితే ఈ వారం మాత్రం రిజర్వ్ బ్యాంకు పాలసీ కమిటీ భేటీ మార్కెట్లకు కీలకం కానుంది. మరోవైపు ఈ దఫా వడ్డీ రేట్లు యధాతథ స్థితి కొనసాగించే అవకాశం ఉందని సూచనలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ గవర్నర్ వ్యాఖ్యలను బట్టి రూపాయికి మద్దతుగా నిలిచేలా చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

ఈ సీజన్ లో వెలువుడుతున్న క్వార్టర్లీ రిజల్ట్స్ పై ఇప్పటికే జీఎస్టీ కారణంగా ఎర్నింగ్స్ ఆశాజనకంగా వెలువడుతున్నాయి. ఈ వారంలో సుమారు 450 కంపెనీలు ఫలితాలు విడుదల చేస్తున్నాయి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, ఒఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, శ్రీ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, వేదాంత, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఇండియా, టైటాన్ కంపెనీ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. 

అలాగే ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎవెన్యూ సూపర్ మార్కెట్స్, ఎస్కార్ట్స్, ఐడియా సెల్యూలర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్, ఐడీఎఫ్‌సీ, డాబర్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. టాటా గ్లోబల్, మారికో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, వొక్‌హార్డ్‌త్ లాంటి సంస్థలు కూడా ఈ వారంలోనే రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. 

అలాగే ఇన్వెస్టర్లు జూన్ నెలకు సంబంధించిన స్థూల ఆర్థిక గణాంకాలైన మౌలికరంగ ఔట్‌పుట్, అలాగే జూలై నెలకు సంబంధించిన ఇండియా నిక్కీ మాన్యుఫాక్చరింగ్ పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ కదలికలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆకాష్ జైన్, అజ్‌కాన్ గ్లోబల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (ఈక్విటీ రీసెర్చ్) స్వల్పకాలంలో 7-10శాతం రిటర్న్స్ అందించే రెండు స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు.

Larsen and Toubro (L&T)| CMP: Rs 1,311 | Target: Rs 1,450 
ఎల్ అండ్ టీ క్యూ1లో అదరగొట్టింది. కాన్సాలిడేట్ పీఎటీ క్యూ1లో 36 శాతం పెరగగా, నికరలాభం రూ.1215 కోట్లు వృద్ధి చెందింది. జూన్ నెలతో ముగిసిన క్వార్టర్‌లో రెవెన్యూ రూ. 28,283 కోట్లు ఆర్జించగా, 18 శాతం వృద్ధి నమోదైంది. సర్వీసు రంగంతో పాటు పలు ప్రాజెక్టుల ద్వారా ఆర్జించిన మొత్తం, అలాగే అంతర్జాతీయ ప్రాజెక్టుల ద్వారా పొందిన మొత్తం కలిపి ఈ క్వార్టర్లో రెవెన్యూ పెరుగుదలకు దోహదపడింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రాజెక్టుల రెవెన్యూ రూ.9669కోట్లుగా నమోదైంది. ఇది మొత్తం రెవెన్యూలో 34 శాతంగా ఉంది. ఇక క్యూ1లో కీలకమైనది ఇన్ఫ్రా సెగ్మెంట్ అనే చెప్పవచ్చు. ఈ విభాగం ద్వారా సుమరు 43 శాతం రెవెన్యూ వాటా  ఆర్జించగా, పవర్ విభాగంలో మాత్రం 39 శాతం వాటా రెవెన్యూలో తగ్గింది. ఇక ఇతర వ్యాపార విభాగాలు రెవిన్యూ వాటా 3.8 శాతంగా నమోదైంది. ఇక ఇతర విభాగాలైన హెవీ ఇంజనీరింగ్ విభాగంలో 29 శాతం వృద్ధి నమోదైంది. అలాగే డిఫెన్స్ విభాగంలో 37.4శాతం వృద్ధి  నమోదు కాగా, హైడ్రో కార్బన్ విభాగంలో 12.4 శాతం వృద్ధి  నమోదు అయ్యింది. కంపెనీ ఈ క్వార్టర్లో రూ. 36,142కోట్లకు చేరింది. ఇందులో ఇంటర్నేషనల్ ఆర్డర్స్ వాటా సుమారు 26 శాతంగా ఉంది. కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ సుమారు. రూ. 271,732 కోట్లుగా ఉంది. దీన్ని బట్టి రానున్న రెండేళ్లలో ఎల్ ఎండ్ టీ రాబడి ఆశాజనకంగా కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎల్ అండ్ టీ మరిన్ని ఆర్డర్లు వెల్లువెత్తే చాన్స్ ఉందని ఊహిస్తోంది. 

Asian Paints | CMP: Rs 1,434 | Target: Rs 1,600
దేశీయ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ మొదటి క్వార్టర్ లో రెండంకెల వృద్ధి సాధించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం 30.56 శాతం వృద్ధి  నమోదు చేయగా, నికర లాభం రూ. 427.41 కోట్లుగా ప్రకటించింది. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్స్ విధానంలో మార్పులు ఏషియన్ పెయింట్స్ ఆదాయంలో లాభాదాయకత పెంచాయి. పెయింట్స్ విభాగంలో జీఎస్టీ 28 శాతం నుంచి 18 తగ్గించడం కంపెనీకి కలిసి వచ్చే అంశం. మరోవైపు జీఎస్టీ తగ్గింపును కస్టమర్లకు లబ్ది చేకూర్చేలా ధరలు తగ్గించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటోంది. 

రానున్న ఫెస్టవల్ సీజన్ నేపథ్యంలో కంపెనీ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో రికవరీ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అంతే కాదు సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు ప్రణాళిక వేసింది. ఇందులో సుమారు రూ.800 కోట్ల పెట్టుబడితో ఇప్పటికే మైసూరు, విశాఖ పట్టణంలో యూనిట్లను నిర్మిస్తున్నారు. 
 Most Popular